Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mistakes in TG DSC 2024 Key: తప్పుల తడకగా తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. ప్రాథమిక ‘కీ’లో లెక్కలేనన్ని దోషాలు

తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్టు 5 తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 2,79,957 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 2,45,263 మంది (87.61) పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ కూడా ఇటీవల విడుదలైంది. అయితే ఆన్సర్‌ కీలో పలు ప్రశ్నలకు..

Mistakes in TG DSC 2024 Key: తప్పుల తడకగా తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. ప్రాథమిక 'కీ'లో లెక్కలేనన్ని దోషాలు
TG DSC 2024 Exam Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 18, 2024 | 9:43 AM

హైదరాబాద్‌, ఆగస్టు 18: తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్టు 5 తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 2,79,957 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 2,45,263 మంది (87.61) పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ కూడా ఇటీవల విడుదలైంది. అయితే ఆన్సర్‌ కీలో పలు ప్రశ్నలకు సమాధానలు తప్పుగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

‘రైట్‌ టూ ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌’కు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా ఈ చట్టం ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినది ఆన్సర్‌ కీలో సమాధానం వచ్చింది. ప్రతిష్టాత్మకమైన డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా ఈ ప్రశ్నకు ఆప్షన్లుగా ఆర్టీఐ యాక్ట్‌, ఆర్సీఐ యాక్ట్‌, ఆర్టీఈ యాక్ట్‌, ఆర్‌పీడబ్ల్యూడీ యాక్ట్‌ అని ఇచ్చారు. వాస్తవానికి ఒక్క ఆర్టీఐ యాక్ట్‌ తప్ప మిగతా చట్టాలన్నింటిని ప్రత్యేకావసరాలు గల వారి కోసం రూపొందించారు. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఆర్‌పీడబ్ల్యూడీ యాక్ట్‌ ఈ ప్రశ్నకు సరైన సమాధానంగా ఇచ్చారు. ఇది తప్పు అని అభ్యర్థులతోపాటు నిపుణులు ఆరోపిస్తున్నారు. అలాగే ADHD పూర్తి రూపం ‘అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజాస్టర్‌’ కాగా, బదులుగా మాస్టర్‌ ‘కీ’లో మాత్రం ‘ఆటో డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజాస్టర్‌’ సరైన సమాధానంగా ప్రకటించారు.

ఇలాగే డీఎస్సీ ప్రశ్నపత్రాల్లో ఒకే పేపర్‌లో ఏకంగా 18 వరకు తప్పులున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(స్కూల్‌ అసిస్టెంట్‌) పరీక్ష మాస్టర్‌ ‘కీ’లో 160 ప్రశ్నలకు ఇచ్చిన ప్రాథమిక కీలో అత్యధిక తప్పులున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రశ్నపత్రం రూపకల్పనపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో-4 ప్రకారం ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క లర్నింగ్‌ డిసెబిలిటీలో 35 వరకు ప్రశ్నలిచ్చినట్లు చెబుతున్నారు. తెలుగు గ్రేడ్‌-1 పరీక్ష ‘కీ’ లోనూ 5 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చినట్లు అభ్యర్ధులు వాపోతున్నారు. కాగా డీఎస్సీ ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’పై అభ్యంతరాలు గుర్తిస్తే.. వాటిని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. అభ్యంతరాలు లేవనెత్తడం ద్వారా సరైన సమాధానాన్ని సూచించవచ్చు. ఇందుకు ఆగస్టు 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అవసరమైతే మెయిల్‌ లేదా ఫోన్‌ చేయవచ్చునంటూ విద్యాశాఖ ఇప్పటికే మెయిల్‌ అడ్రస్‌లతో పాటు, ఫోన్‌ నంబర్లను ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.