AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026 Registration: నీట్‌ యూజీ 2026కి ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ యూజీ 2026) ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు రాత్రి..

NEET UG 2026 Registration: నీట్‌ యూజీ 2026కి ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
NEET UG Online Registration
Srilakshmi C
|

Updated on: Mar 08, 2026 | 11:01 AM

Share

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ యూజీ 2026) ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు మార్చి 8 రాత్రి 9 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సూచించింది. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1700, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్‌ జండర్‌ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన అభ్యర్థులు రూ.9500 చొప్పున చెల్లించాలి.

ఇక నీట్‌ యూజీ 2026 రాత పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మే 3న మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనుంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో (పెన్ను, పేపర్‌ విధానం) నిర్వహించనున్నారు. యూజీ 2026 రాత పరీక్ష మొత్తం180 నిమిషాల పాటు (3 గంటలు) ఉంటుంది.

నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌ యూజీ) 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ సైన్స్‌ గ్రూప్‌లో ఉత్తీర్ణత పొందిఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి ఉండదు. దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్‌ ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. అలాగే లైవ్‌ఫొటో క్యాప్చర్ కూడా ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తద్వారా సిస్టమ్‌ మీ లైవ్‌ ఫొటోని ఆటోమేటిక్‌గా ఆధార్‌తో సరిపోల్చుతుంది. ఒకవేళ లైవ్‌ ఫొటో ఆధార్‌తో సరిపోలకపోతే.. తగిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. నీట్‌

ఇవి కూడా చదవండి

నీట్‌ యూజీ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us