Postal GDS Result Date: పోస్టల్ శాఖలో జీడీఎస్ పోస్టుల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..! ఈ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి..

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 44,228 జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వీటి ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,355, తెలంగాణలో 981 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష, ఇంటర్వ్యూ వంటివి ఏమీ ఉండవు. కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా..

Postal GDS Result Date: పోస్టల్ శాఖలో జీడీఎస్ పోస్టుల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..! ఈ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి..
Postal GDS Result Date
Follow us

|

Updated on: Aug 19, 2024 | 6:38 AM

హైదరాబాద్‌, ఆగస్టు 19: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 44,228 జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వీటి ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,355, తెలంగాణలో 981 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష, ఇంటర్వ్యూ వంటివి ఏమీ ఉండవు. కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొంది, ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తపాలా శాఖ ఫోన్‌ లేదా ఈ మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తుంది. దరఖాస్తులో అభ్యర్థి పేర్కొ్న్న మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, మెయిల్, పోస్టల్‌ అడ్రస్‌ ద్వారా సమాచారం అందిస్తారు. అలాగే ఎంపికైన అభ్యర్ధుల జాబితాను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

కాగా గతేడాది మొత్తం నాలుగు సెలక్షన్‌ లిస్టులను తపాలా శాఖ విడుదల చేసింది. మొదటి సెలక్షన్‌ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా విధుల్లో చేరకపోతే ఆ పోస్టులకు రెండో లిస్టును వెల్లడిస్తారు. రెండో లిస్టులో కూడా ఖాళీలు ఏర్పడితే మూడో లిస్టు, దీనిలోనూ చేరకపోతే నాలుగో లిస్టు ఇలా నాలుగు విడతలుగా ఖాళీలను భర్తీ చేస్తారు. టెన్త్‌ మార్కులు ఆధారంగా ప్రకటనలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్రాంచీ, హోదా, ప్రాధాన్యం మేరకు వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ ఇస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేందుకు గతేడాది 20 రోజుల సమయం పట్టింది. 2023లో ఫిబ్రవరి 2వరకు దరఖాస్తు స్వీకరించగా.. ఫలితాలు మాత్రం మార్చి 11వ తేదీన వెలువడ్డాయి. 20 రోజుల్లో ఫలితాలు వెల్లడించారు. 2024 ఏడాదికి సంబంధించి దరఖాస్తుకు గడువు ఆగస్టు 5తో ముగిసింది. దీనిని బట్టిచూస్తే ఫలితాలు ఆగస్టు నెలాఖరుకు ముందే వెల్లడయ్యే అవకాశం ఉంది. జీడీఎస్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకావల్సి ఉంటుంది. అందుకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు అవసరమైన పత్రాలు ఇవే..

  • దరఖాస్తుకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌
  • పుట్టిన తేదీ ధ్రువీకరణకు పదో తరగతి మార్కుల మెమో
  • 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
  • ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్‌ కార్డు
  • ఇన్‌కాం సర్టిఫికెట్‌
  • మెడికల్‌ సర్టిఫికెట్‌

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

'ఆకులో ఆకునై'.. ఈ ఫొటోలో ఓ పాము ఉంది కనిపెట్టగలరా.?
'ఆకులో ఆకునై'.. ఈ ఫొటోలో ఓ పాము ఉంది కనిపెట్టగలరా.?
'APPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే'
'APPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే'
మాయ లేడీ.. నమ్మారో మీ ఇల్లు ఖాళీ
మాయ లేడీ.. నమ్మారో మీ ఇల్లు ఖాళీ
'ఆ వదంతులను నమ్మవద్దు'.. ఆస్పత్రి నుంచి సింగర్ సుశీల డిశ్చార్జ్
'ఆ వదంతులను నమ్మవద్దు'.. ఆస్పత్రి నుంచి సింగర్ సుశీల డిశ్చార్జ్
చికెన్‌ స్కిన్‌తో తింటే మంచిదా, కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే..
చికెన్‌ స్కిన్‌తో తింటే మంచిదా, కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 5లక్షలకు పైగా భక్తులు హాజరు
ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 5లక్షలకు పైగా భక్తులు హాజరు
చరిత్ర మరవని ఘటన ఆధారంగా వెబ్‌ సిరీస్‌.. ఆక్టట్టుకుంటోన్న ట్రైలర్
చరిత్ర మరవని ఘటన ఆధారంగా వెబ్‌ సిరీస్‌.. ఆక్టట్టుకుంటోన్న ట్రైలర్
సీఎం స్టాలిన్‌ లేఖపై మంత్రి అశ్విని వైష్ణవ్ దిమ్మతిరిగే రియాక్షన్
సీఎం స్టాలిన్‌ లేఖపై మంత్రి అశ్విని వైష్ణవ్ దిమ్మతిరిగే రియాక్షన్
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభాస్ పెద్దమ్మ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌..
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభాస్ పెద్దమ్మ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌..
హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానలు..
హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానలు..