Singer P Susheela: ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

పద్మభూషణ్‌ గ్రహీత అయిన సుశీల.. తెలుగు సినీ వినీలాకాశంలో ఎన్నో అద్భుత గీతాలు ఆలపించి సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు. సుశీల తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం 9 భాషలలో 40 వేలకుపైగా పాటలు పాడారు. సినిమాలోని సావిత్రి, పద్మిని, సరోజాదేవి వంటి దిగ్గజ నటీమణులకు పాటలు పాడారు. తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు సుశీల..

Singer P Susheela: ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Singer P Susheela
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 18, 2024 | 6:19 AM

చెన్నై, ఆగస్టు 18: ప్రముఖ సినీ గాయని పి సుశీల (86) శనివారం (ఆగస్టు 18) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వయోభారంతో గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో సుశీల బాధపడుతున్నారు. శనివారం ఆమెకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటనే చికిత్స అందించారు. అది మామూలు కడుపు నొప్పేనని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల పేర్కొన్నాయి. సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

కాగా పద్మభూషణ్‌ గ్రహీత అయిన సుశీల.. తెలుగు సినీ వినీలాకాశంలో ఎన్నో అద్భుత గీతాలు ఆలపించి సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు. సుశీల తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం 9 భాషలలో 40 వేలకుపైగా పాటలు పాడారు. సినిమాలోని సావిత్రి, పద్మిని, సరోజాదేవి వంటి దిగ్గజ నటీమణులకు పాటలు పాడారు. తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు సుశీల. ఉష్రేష్ మన్మాన్ చిత్రంలోని ‘లైక్ పాల్’ అనే పాటకు ఆమె మొదటిసారిగా ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. వయసు రిత్యా గత కొంత కాలంగా ఆమె పాటలు పాడడం మానేసి.. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. తాజాగా అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఆళ్వార్ పేటలోని కావేరీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సుశీల త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.