Vijay Raaz: షూటింగ్ సెట్లో హీరోకు హాయ్ చెప్పలేదని సినిమా నుంచి తొలగించారు.. అసలేం జరిగిందంటే.
ఈ చిత్రంలో విజయ్ స్థానంలో సంజయ్ మిశ్రా నటించారు. ఈ మూవీ షూటింగ్ యూకేలో జరుగుతోంది. పింక్‌విల్లా నివేదిక ప్రకారం, "విజయ్ రాజ్ ప్రవర్తన కారణంగా మేము అతనిని సినిమా నుండి తొలగించాము" అని కుమార్ మంగత్ పాఠక్ చెప్పారు. విజయ్ ఒక పెద్ద గది , వ్యానిటీ వ్యాన్ డిమాండ్ చేసినట్లు కుమార్ చెప్పాడు.
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా నుంచి నటుడు విజయ్ రాజ్‌ని తొలగించారు. ఒక నివేదిక ప్రకారం.. అజయ్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కుమార్ మంగత్ పాఠక్, విజయ్ ప్రవర్తన, అతడి అసామాన్య డిమాండ్ల కారణంగా అతన్ని తొలగించినట్లు చెప్పారు. అయితే సెట్స్‌పై అజయ్ దేవగన్‌ని పట్టించుకోకపోవడంతో తనను సినిమా నుంచి తొలగించారని విజయ్ తెలిపాడు. ఈ చిత్రంలో విజయ్ స్థానంలో సంజయ్ మిశ్రా నటించారు. ఈ మూవీ షూటింగ్ యూకేలో జరుగుతోంది. పింక్‌విల్లా నివేదిక ప్రకారం, “విజయ్ రాజ్ ప్రవర్తన కారణంగా మేము అతనిని సినిమా నుండి తొలగించాము” అని కుమార్ మంగత్ పాఠక్ చెప్పారు. విజయ్ ఒక పెద్ద గది , వ్యానిటీ వ్యాన్ డిమాండ్ చేసినట్లు కుమార్ చెప్పాడు. దీంతో పాటు స్పాట్ బాయ్ కోసం తమ నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశారని.. విజయ్ స్పాట్ బాయ్‌కి ప్రతి రాత్రి రూ. 20 వేలు చెల్లించారని, ఇది ఏ పెద్ద నటుడి కంటే ఎక్కువ అని అన్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలపై విజయ్ స్పందించాడు.
తాను షూటింగ్ సెట్‌కి రాగానే రవి కిషన్, దర్శకుడు విజయ్ అరోరా, కుమార్ తదితరులు తనను కలిశారని విజయ్ తన వాదనను వినిపించాడు. “నేను వ్యాన్ నుండి బయటకు వచ్చి, అజయ్ దేవగన్ 25 మీటర్ల దూరంలో నిలబడి చూశాను, ఎందుకంటే అతను బిజీగా ఉన్నాడు కాబట్టి నేను అతనికి హలో చెప్పలేదు. నేను నా స్నేహితులతో మాట్లాడుతూనే ఉన్నాను. ఈ ఘటన జరిగిన 25 నిమిషాల తర్వాత కుమార్ మంగత్ నా వద్దకు వచ్చి నిన్ను సినిమా నుంచి తొలగిస్తున్నామని చెప్పాడు. నా వైపు నుండి తప్పు ప్రవర్తన ఏమిటంటే, నేను అజయ్ దేవగన్‌కి హలో చెప్పలేదు. నేను సిబ్బందిని కూడా కలవలేదు. సెట్‌కు చేరుకున్న 30 నిమిషాల తర్వాత నన్ను సినిమా నుంచి తొలగించారు. వీరు శక్తివంతమైన వ్యక్తులు, వారు ఏదైనా చేయగలరు. ఆగస్ట్ 4 మధ్యాహ్నం తనను సినిమా నుండి తొలగించినట్లు విజయ్ చెప్పాడు.
నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ మాట్లాడుతూ.. “UK చాలా ఖరీదైన ప్రదేశం, షూటింగ్ సమయంలో అందరికీ మంచి, ఖరీదైన గదులు ఉన్నాయి, కానీ విజయ్ ప్రీమియం సూట్‌లను డిమాండ్ చేశాడు. ఇతర నటీనటులు, నేను కూడా అతను ఉన్న గదిలోనే ఉన్నాము నటీనటులందరూ బస చేసిన గది ఒక రాత్రికి రూ. 45 వేలు అని, ఇది అత్యుత్తమ హోటల్‌లలో ఒకటి. అయితే విజయ్ ఇక్కడితో ఆగకుండా తాను తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా విజయ్ తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని కుమార్ ఆరోపించారు. నేను పని అడగడానికి వచ్చానని, మీరు నన్ను సంప్రదించారని విజయ్ పదేపదే చిత్ర బృందానికి అసభ్యంగా చెప్పాడని కూడా చెప్పాడు.
‘సన్ ఆఫ్ సర్దార్ 2’ 2012లో విడుదలైన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’కి సీక్వెల్. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు మృణాల్ ఠాకూర్, నీరూ బజ్వా కూడా నటించారు.