AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy 2025-26: రంజీ ట్రోఫీలో జమ్మూ-కాశ్మీర్ సంచలనం.. 67 ఏళ్ల నిరీక్షణకు తెర

Ranji Trophy 2025-26: భారత దేశీవాళీ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ పోరులో జమ్మూ-కాశ్మీర్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది.హుబ్బళ్లిలోని కేఎస్‌సీఏ మైదానంలో కర్ణాటకతో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూ-కాశ్మీర్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

Ranji Trophy 2025-26: రంజీ ట్రోఫీలో జమ్మూ-కాశ్మీర్ సంచలనం.. 67 ఏళ్ల నిరీక్షణకు తెర
Ranji Trophy
Rakesh
|

Updated on: Feb 28, 2026 | 11:20 AM

Share

Ranji Trophy 2025-26: భారత దేశీవాళీ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ పోరులో జమ్మూ-కాశ్మీర్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. హుబ్బళ్లిలోని కేఎస్‌సీఏ మైదానంలో కర్ణాటకతో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూ-కాశ్మీర్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, తొలిసారి ఫైనల్‌కు చేరిన ఆ జట్టు.. ఇప్పుడు ఏకంగా ఛాంపియన్‌గా అవతరించేందుకు సిద్ధమైంది.

ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జమ్మూ-కాశ్మీర్, మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 584 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కర్ణాటక జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 293 పరుగులకే కుప్పకూలింది. కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (160) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, జమ్మూ-కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ 5 వికెట్లతో చెలరేగడంతో కర్ణాటకకు కష్టాలు తప్పలేదు. దీనివల్ల జమ్మూ-కాశ్మీర్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 291 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లోనూ జమ్మూ జట్టు పట్టు బిగించి, మొత్తం ఆధిక్యాన్ని 477 పరుగులకు చేర్చింది. కమ్రాన్ ఇక్బాల్ (94 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా జమ్మూ-కాశ్మీర్‌నే విజేతగా ప్రకటిస్తారు.

జమ్మూ-కాశ్మీర్ క్రికెట్ ప్రయాణంలో ఇది ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పాలి. 1959-60లో రంజీ ట్రోఫీలో అడుగుపెట్టిన ఆ జట్టు, తన మొదటి విజయాన్ని అందుకోవడానికి 1982-83 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు 67 ఏళ్ల తర్వాత ఏకంగా టైటిల్ వేటలో ఉండటం అక్కడి క్రీడాకారుల పట్టుదలకు నిదర్శనం. గతంలో పర్వేజ్ రసూల్ వంటి ఆటగాళ్లు జట్టును నడిపించినా, ఈ స్థాయి విజయం మాత్రం వారికి ఎప్పుడూ దక్కలేదు. ఇప్పుడు ఈ యువ జట్టు ఆ కలను నిజం చేయబోతోంది.

ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు బీసీసీఐ నుంచి భారీ నజరానా దక్కనుంది. రణజీ ట్రోఫీ విజేతకు రూ.5 కోట్లు ప్రైజ్ మనీగా ఇస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.3 కోట్లు అందుతాయి. సెమీఫైనల్స్ వరకు చేరిన జట్లకు కూడా రూ.కోటి చొప్పున బహుమతి లభిస్తుంది. ఈ చారిత్రాత్మక విజయం జమ్మూ-కాశ్మీర్ క్రికెట్‌ రూపురేఖలను మార్చేస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అద్భుత క్షణం కోసం యావత్ క్రికెట్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us