AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Sree Vishnu : హీరో శ్రీవిష్ణు ఫ్యామిలీని చూశారా..? భార్య, కూతురు ఫోటోస్ షేర్ చేసిన నటుడు..

మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో అలరిస్తున్న శ్రీవిష్ణు.. కొద్దిరోజులుగా జనాలను మెప్పించే సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం స్వాగ్ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీవిష్ణు సినిమాల గురించి మినహా తన ఫ్యామిలీ గురించి అభిమానులకు అంతగా తెలియదు. అలాగే సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీలలోనూ శ్రీవిష్ణు ఫ్యామిలీ అంతగా కనిపించదు.

Actor Sree Vishnu : హీరో శ్రీవిష్ణు ఫ్యామిలీని చూశారా..? భార్య, కూతురు ఫోటోస్ షేర్ చేసిన నటుడు..
Sreevishnu
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2024 | 11:03 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీవిష్ణు. కొన్ని రోజులుగా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుంటున్నాడు. సామజవరగమన సినిమాతో కెరీర్ లో మొదటిసారి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాడు. ఆ తర్వాత ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఈ రెండు చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టాయి. శ్రీవిష్ణు చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో అలరిస్తున్న శ్రీవిష్ణు.. కొద్దిరోజులుగా జనాలను మెప్పించే సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం స్వాగ్ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీవిష్ణు సినిమాల గురించి మినహా తన ఫ్యామిలీ గురించి అభిమానులకు అంతగా తెలియదు. అలాగే సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీలలోనూ శ్రీవిష్ణు ఫ్యామిలీ అంతగా కనిపించదు.

కానీ తాజాగా శ్రీవిష్ణు ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇటీవల తన భార్య ప్రశాంతి పుట్టినరోజు సందర్భంగా భార్య, కూతురు మ్రిదాతో ఉన్న ఫోటో షేర్ చేస్తూ ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపాడు శ్రీవిష్ణు. అళాగే ఓ వెకేషన్ నుంచి తన భార్య ఫోటో ఒక్కటే స్పెషల్ గా షేర్ చేసి విషెస్ తెలిపాడు. శ్రీవిష్ణు పోస్ట్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. తమ అభిమాన హీరోకు ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అలాగే శ్రీవిష్ణు కూతురు ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీవిష్ణు స్వాగ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హాసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ లో మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సనీల్, రవిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sree Vishnu (@sreevishnu29)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..