AP RGUKT 2024 Result: ఆగస్టు 20న ఆర్జీయూకేటీలో దివ్యాంగుల కోటా కౌన్సెలింగ్.. సెలక్షన్ లిస్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి మూడో విడత (ఫేజ్-3) అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఆర్జీయూకేటీ మూడో సెలక్షన్ లిస్ట్ ఆగస్టు 20వ తేదీ లేదా అంతకంటే ముందే వెల్లడించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది..
అమరావతి, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి మూడో విడత (ఫేజ్-3) అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఆర్జీయూకేటీ మూడో సెలక్షన్ లిస్ట్ ఆగస్టు 20వ తేదీ లేదా అంతకంటే ముందే వెల్లడించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో తొలి, రెండో విడతలో భర్తీకాని ఖాళీగా ఉన్న సీట్లకు ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం.. నాలుగు క్యాంపస్‌లలో దివ్యాంగుల కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి ఎంపిక జాబితాను ఆర్జీయూకేటీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులందరికీ ఆగస్టు 20వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. క్యాంపస్‌లను మార్చుకున్న అభ్యర్థులతో పాటు కొత్తగా ప్రవేశాలు పొందిన వారు సంబంధిత క్యాంపస్‌లో ఆగస్టు 19, 20వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఆర్జీయూకేటీలో దివ్యాంగుల కోటా సెలక్షన్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ఫీజు గడువు పెంపు
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పది, ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లించే గడువును పొడిగించింది. ఆగస్టు 22 నుంచి 30వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. రూ.25ల ఆలస్యరుసుంతో సెప్టెంబరు 4, రూ.50తో సెప్టెంబరు 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.