AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకాశంలో అద్భుతాలు.. 2026లో అరుదైన సూర్య, చంద్ర గ్రహణాల విశేషాలు

2026లో రెండు అరుదైన గ్రహణాలు - ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం, ఆగస్టు 28న "బ్లడ్ మూన్" చంద్రగ్రహణం - సంభవించనున్నాయి. అయితే, ఈ ఖగోళ అద్భుతాలు భారత్‌లో కనిపించవు. మన దేశంలో రాత్రి సమయం లేదా పగటిపూట చంద్రుడు క్షితిజానికి దిగువన ఉండటమే కారణం. కనిపించని గ్రహణాలకు సూతక కాల నియమాలు వర్తించవని పండితులు స్పష్టం చేస్తున్నారు.

ఆకాశంలో అద్భుతాలు.. 2026లో అరుదైన సూర్య, చంద్ర గ్రహణాల విశేషాలు
2026 Solar Eclipse
B Ravi Kumar
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 10:10 PM

Share

ఈ ఏడాది ఆకాసంలో చాలా అద్బుతాలు జరగబోతున్నాయట. ఖగోళ పరోధకులు , అంతరిక్షవీక్షకులు ఈ ఏడాది 2026 సంవత్సరంను ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే మార్చి 3న భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించింది. ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఇది ఇక ఈ సంవత్సరంలోనే అత్యంత దీర్ఘమైన గ్రహణంగా కూడా దీన్ని పంచాంగ కర్తలు ప్రకటించారు. అయితే ఈ ఏడాది బ్రహ్మాండంలో కొన్ని అరుదైన ఖగోళ ఘటనలు చోటుచేసుకోబోతున్నాయంటున్నారు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాపీటం ఆస్థాన సిద్దాంతి కే యెన్ వి పార్వతిశ్వర శర్మ ఆయన ఏమి చెబుతున్నారంటే 2026 ఆగస్టు 12న ఒక అత్యంత అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించబోతోంది. సంపూర్ణ గ్రహణం కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపించినప్పటికీ మొత్తం గ్రహణ ప్రక్రియ మాత్రం గంటల పాటు కొనసాగుతుంది.

భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఆగస్టు 12 రాత్రి 10 – 27 గంటలకు ప్రారంభమై, 12-03 వరకు ఉంటుంది. ఇది 2026లో జరిగే అత్యంత ముఖ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటి. ఈ గ్రహణం ప్రధానంగా గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్ మరియు ఆర్కిటిక్ ప్రాంతాల్లోని కొన్ని దేశాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో భారత్‌లో రాత్రి సమయం ఉంటుంది. సూర్యుడు అప్పటికే క్షితిజానికి దిగువన ఉండటంతో ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.

అదేవిధంగా సూర్యగ్రహణం తర్వాత కొద్ది రోజులకే అంటే ఆగస్టు 28న మరో ఆసక్తికరమైన చంద్రగ్రహణం సంభవించనుంది. దీనిని “బ్లడ్ మూన్” తరహా గ్రహణంగా పరిగణిస్తున్నారు. ఈ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై 11.22 నిమిషాలకు పూర్తి అవుతుంది. ఇది ప్రధానంగా అమెరికా, యూరప్ , ఆఫ్రికా లోని కొన్ని ప్రాంతాల్లో వారికి మాత్రమే కనిపిస్తుంది. అక్కడ ఉదయం 6:53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:32 గంటలకు ముగుస్తుంది. మొత్తం వ్యవధి సుమారు 5 గంటలు 39 నిమిషాలు ఉంటుంది. అయితే భారత్‌లో ఈ చంద్రగ్రహణం కనిపించదు. ఈ సమయంలో భారత్‌లో అప్పటికే సూర్యోదయం అయి పగలు ఉంటుంది. చంద్రుడు క్షితిజం దిగువకు వెళ్లిపోవడంతో ఈ చంద్రగ్రహణం కూడా భారతదేశ వాసులు చూడలేరు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి 2026లో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటి అరుదైన ఖగోళ సంఘటనలు జరుగుతున్నప్పటికీ, అవి భారత్‌లో కనిపించకపోవడం వల్ల భారతీయులు ప్రత్యక్షంగా వీటిని చూడలేరు. అయినప్పటికీ, ఈ సంఘటనలు ఖగోళ శాస్త్రవేత్తలు , అంతరిక్ష విజ్ఞాన పరిశోధకులు , పంచాంగ కర్తలు ఈ గ్రహణాల సంభవం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రుడు భూమికి, సూర్యునికి మధ్య వచ్చినప్పుడు సూర్యగ్రహణం (అమావాస్య), భూమి సూర్యునికి, చంద్రునికి మధ్య వచ్చినప్పుడు చంద్రగ్రహణం (పౌర్ణమి) సంభవిస్తాయి. సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్య రోజునే జరుగుతుంది. చంద్రగ్రహణం ఇది సాధారణంగా పౌర్ణమి రోజున సంభవిస్తుంది.

ఖగోళంలో సంభవించే ఈ సహజ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక భారతదేశంలో గ్రహణ సమయంలో సూతక కాల నియమాలను పాటిస్తుంటారు. అయితే గ్రహణం కనిపించినప్పుడు మాత్రమే దాని ప్రభావం ఉంటుందని అందువల్ల ఆగస్టు లో సంభవించబోయే సూర్య, చంద్ర గ్రహణాలు భారత్‌లో కనిపించకపోవడంతో సూతక నియమాలు పాటించాల్సిన అవసరం ఉండదని కే యెన్ వి పార్వతిశ్వర శర్మ చెబుతున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆత్మవిశ్వాసాన్ని పెంచి, కెరీర్‌లో రాణించేలా చేసే ‘సక్సెస్ మంత్ర’
ఆత్మవిశ్వాసాన్ని పెంచి, కెరీర్‌లో రాణించేలా చేసే ‘సక్సెస్ మంత్ర’
ఎటువైపు తిరిగి నిద్రపోతున్నారు? ఇలా పడుకుంటే ఒత్తిడి తప్పదట!
ఎటువైపు తిరిగి నిద్రపోతున్నారు? ఇలా పడుకుంటే ఒత్తిడి తప్పదట!
నోస్టాల్జియా ఒక మత్తు.. క్లోజర్ కోసం వెళితే కొత్త గాయాలు తప్పవ్
నోస్టాల్జియా ఒక మత్తు.. క్లోజర్ కోసం వెళితే కొత్త గాయాలు తప్పవ్
ఒక్క వారం పాటు యూపీఐ వాడకపోతే.. నగరాల్లో బతుకు కష్టమేనా?
ఒక్క వారం పాటు యూపీఐ వాడకపోతే.. నగరాల్లో బతుకు కష్టమేనా?
పార్కిన్సన్స్ వ్యాధికి ఇది ముందస్తు సంకేతమా?
పార్కిన్సన్స్ వ్యాధికి ఇది ముందస్తు సంకేతమా?
పాన్ కార్డ్ డౌన్‌లోడ్ పేరుతో మెయిల్ వచ్చిందా..?
పాన్ కార్డ్ డౌన్‌లోడ్ పేరుతో మెయిల్ వచ్చిందా..?
ఆకాశంలో అద్భుతాలు.. 2026లో అరుదైన సూర్య, చంద్ర గ్రహణాలు
ఆకాశంలో అద్భుతాలు.. 2026లో అరుదైన సూర్య, చంద్ర గ్రహణాలు
ఆత్మీయ పలకరింపు..గుండెకు శ్రీరామరక్ష! ఆక్సిటోసిన్ మ్యాజిక్ తెలుసు
ఆత్మీయ పలకరింపు..గుండెకు శ్రీరామరక్ష! ఆక్సిటోసిన్ మ్యాజిక్ తెలుసు
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. వీటిని ఉడకబెట్టి తింటే..
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. వీటిని ఉడకబెట్టి తింటే..
మమ్ముట్టికి సీఎం విజయన్ క్షమాపణలు.. అసలు ఏం జరిగిందంటే..?
మమ్ముట్టికి సీఎం విజయన్ క్షమాపణలు.. అసలు ఏం జరిగిందంటే..?