AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: పొరపాటున కూడా ఈ 4 వస్తువులను బెడ్‌రూమ్‌లో పెట్టకండి.. లేదంటే తిప్పలు తప్పవు!

మన ఇంట్లోని ఒక్కొక్క గదికి ఒక్కొక్క వస్తువును ఉంచుతాం. అయితే వాస్తు ప్రకారం కొన్ని గదుల్లో కొన్ని వస్తువులు ఉంచడం, మరికొన్నింటిని ఉంచకపోవడం వంటి వాస్తు నియమాలు ఉంటాయి. ముఖ్యంగా పడక గది అనేది దంపతుల ప్రశాంత జీవనానికి, సఖ్యతకు మూలం కాబట్టి, ఇక్కడ ఏ వస్తువులు ఉంచాలి, ఏవి ఉంచకూడదు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి బెడ్‌రూమ్‌లో ఏ వస్తువులు పెట్టాలి, ఏ వస్తువులు పెట్టరాదో తెలుసుకుందాం.

Vastu Tips: పొరపాటున కూడా ఈ 4 వస్తువులను బెడ్‌రూమ్‌లో పెట్టకండి.. లేదంటే తిప్పలు తప్పవు!
Bedroom Vastu Tips
Anand T
|

Updated on: Mar 09, 2026 | 8:34 PM

Share

మన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, పూర్వ కాలంలో పడక గదులు ప్రత్యేకంగా ఉండేవి కావు. రాజుల అంతఃపురాలు మినహా సామాన్యుల ఇళ్లలో ఒకే గదిలో కుటుంబ సభ్యులు మొత్తం సర్దుకుపోయేవారు. బెడ్ రూమ్‌ల సంస్కృతి గత వంద, నూట యాభై ఏళ్లుగా మాత్రమే ప్రచారంలోకి వచ్చింది. ఒకప్పుడు మంచాలు కూడా పర్మినెంట్‌గా ఉండేవి కావు. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక పడక గది ఉంటుంది. ఈ పడక గదిలో వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు.

బెడ్ రూమ్‌లో ఉంచకూడని వస్తువులు ఇవే

అద్దం: చాలా మంది బెడ్‌రూమ్‌లో అద్దాలను ఉచుకుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. పడుకున్న మంచం అద్దంలో కనిపించకూడదు. అద్దం బెడ్ రూమ్‌లో ఉన్నా, అది పక్కకు ఉండాలి కానీ, మంచాన్ని ప్రతిబింబించే విధంగా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకున్న వారి ప్రతిబింబం అద్దంలో పడటం మంచిది కాదు అంటున్నారు..

గోడ గడియారం: మంచానికి ఎదురుగా, నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే కనిపించేలా బెడ్‌రూమ్ గోడకు గడియారం ఉండకూడదు. సమయాన్ని పదేపదే చూసుకోవడం ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. గడియారాన్ని బెడ్ రూమ్‌లో ఉంచాల్సి వస్తే, మంచానికి పక్కన లేదా కళ్ళు తెరవగానే కనిపించని ప్రదేశంలో పెట్టుకోవచ్చు.

దేవుడి పటాలు, విగ్రహాలు:పిల్లల బెడ్ రూమ్‌ల విషయంలో మినహా, దంపతుల పడక గదుల్లో దేవతా చిత్రపటాలు, విగ్రహాలు ఉంచడం ఆచార విరుద్ధం. పొద్దున్నే లేవగానే దేవుడిని చూసుకోవాలనే ప్రశ్న వస్తుంది. అయితే పూర్వం పటాలు లేని రోజుల్లో, ఉదయం లేవగానే కరాగ్రే వసతే లక్ష్మీ శ్లోకాన్ని స్మరిస్తూ చేతులను చూసుకునే పద్ధతి ఉండేదని రామా రావి గారు గుర్తుచేశారు. దేవుడిని హాల్లో లేదా పూజ గదిలో పెట్టుకుని, మొహం కడుక్కున్న తర్వాత దండం పెట్టుకోవచ్చు.

జంతువుల బొమ్మలు, చిత్రాలు: కుక్కలు, పులులు, సింహాలు, పిల్లులు, కుందేళ్ళు వంటి జంతువుల బొమ్మలను బెడ్ రూమ్‌లో ఉంచకూడదు. ముఖ్యంగా నెమలి బొమ్మలు..వీటికి బదులు నెమలి ఈకలు ఉంచుకోవచ్చునని, అవి గ్రహ దోషాలను తొలగిస్తాయని, భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుతాయని చెబుతారు.

(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వాట్సప్‌లో రీఛార్జ్ ఆప్షన్.. ఒక్క క్లిక్‌తో సెకన్లలోనే ప్రాసెస్..
వాట్సప్‌లో రీఛార్జ్ ఆప్షన్.. ఒక్క క్లిక్‌తో సెకన్లలోనే ప్రాసెస్..
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?