TG SC Study Circle Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఆఫీస్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం అధీనంలో నడిచే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ డెవలప్‌మెంట్ స్టడీ సర్కిల్‌ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్, కోర్సు కో-ఆర్డినేటర్, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు..

TG SC Study Circle Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఆఫీస్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు
TG SC Study Circle
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 18, 2024 | 7:55 AM

తెలంగాణ ప్రభుత్వం అధీనంలో నడిచే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ డెవలప్‌మెంట్ స్టడీ సర్కిల్‌ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్, కోర్సు కో-ఆర్డినేటర్, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఆగస్టు 25వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 7వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ పోస్టుకు ఆపరేటర్ డిగ్రీ, పీజీడీసీఏ, లోయర్‌ గ్రేడ్‌ ఇంగ్లిష్‌/ తెలుగు టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే కోర్సు కో-ఆర్డినేటర్ పోస్టుకు ఏదైనా పీజీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఇక ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ పోస్టుకు బీకాం లేదా ఎంబీఏతో పాటు పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆగస్టు 25, 2024వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేదు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ, పని అనుభవం తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ పోస్టుకు రూ.22,000, ఇతర పోస్టులకు రూ.31,000 చొప్పున జీత భత్యాలు చెల్లిస్తారు. నింపిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌లో అందజేయాలి. ఇతర పూర్తి వివరాలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చు.

అడ్రస్..

ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీస్‌, న్యూ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌, కలెక్టరేట్, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు..

  • ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ పోస్టులు: 1
  • కోర్సు కో-ఆర్డినేటర్ పోస్టులు: 1
  • ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు: 1
  • ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ పోస్టులు: 3

అధికారిక నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు