TGPSC Group1 Mains Schedule: టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పరీక్ష సమయంలో స్వల్ప మార్పు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసుల మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును టీజీపీఎస్సీ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకు జరుగుతాయని వెల్లడించింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేంద్రంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు..
హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసుల మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును టీజీపీఎస్సీ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకు జరుగుతాయని వెల్లడించింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేంద్రంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో జూన్ 12వ తేదీన జారీ అయిన ప్రకటన ప్రకారం.. మెయిన్స్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగాల్సి ఉంది. తాజా షెడ్యూల్‌లో ఈ పరీక్ష సమయంలో మార్పులు చేశామని ఆయన తెలిపారు. పరీక్ష సమయాన్ని అరగంట ముందుకు జరిపామన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం మెయిన్స్ పరీక్షల నమూనా జవాబు పత్రాన్ని ఆగస్టు 17 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జవాబు పత్రం, హాల్ టికెట్‌పై ముద్రించిన సూచనలను అభ్యర్థులు తప్పనిసరి పాటించాలని నవీన్ నికోలస్ సూచించారు.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
- అక్టోబరు 21వ తేదీన అర్హత పరీక్ష జనరల్ ఇంగ్లిష్
- అక్టోబరు 22వ తేదీన పేపర్ 1 జనరల్ ఎస్సే పరీక్ష
- అక్టోబరు 23వ తేదీన పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ పరీక్ష
- అక్టోబరు 24వ తేదీన పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్ పరీక్ష
- అక్టోబరు 25వ తేదీన పేపర్ 4 ఎకానమీ, డెవలప్‌మెంట్ పరీక్ష
- అక్టోబరు 26వ తేదీన పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ పరీక్ష
- అక్టోబరు 27వ తేదీన పేపర్ 6 తెలంగాణ పోరాటం, రాష్ట్ర ఏర్పాటు పరీక్ష
యూజీసీ- నెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఆగస్టు 21 నుంచి పరీక్షలు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 (యూజీసీ- నెట్) పరీక్షల అడ్మిట్ కార్డులను తాజాగా ఎన్‌టీఏ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30, సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గతంలో యూజీసీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే మధ్యలో ఆగస్టు 26వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి పండగ ఉండటంతో.. ఆగస్టు 26వ తేదీ జరగాల్సిన పరీక్షను రీషెడ్యూల్ చేసింది. ఆ పరీక్షను ఆగస్టు 27న నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.
యూజీసీ- నెట్ 2024 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.