Hyderabad: నిరుద్యోగులకు శుభవార్త.. 6నెలల ఉచిత శిక్షణ, ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్

విద్యార్థులతో పాటు, నిరుద్యోగ యువత, గృహిణులకు ఉపయోగపడేలా కోర్సులు అందిస్తున్నారు. ఇందులో భాగంగా 6 నెలల వ్యవధితో కూడిన కోర్సులు ఉంటాయి. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఇందులో భాగంగా ఆఫీస్‌ ఆటోమేషన్‌, టాలీ ప్రైమ్‌, బ్యూటీషియన్‌, పేజీమేకర్‌, ఫొటోషాప్‌, కోరల్‌ డ్రా...

Hyderabad: నిరుద్యోగులకు శుభవార్త.. 6నెలల ఉచిత శిక్షణ, ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్
Ddms Literacy House
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 17, 2024 | 5:26 PM

నిరుద్యోగ యువతకు సదవకాశాన్ని కల్పిస్తోంది దుర్గాబాయ్‌ దేశ్‌ ముఖ్‌ మహిళా సభ (డీడీఎంఎస్‌) లిటరసీ హౌజ్‌. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఈ సంస్థ వివిధ సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాల వయసుల వారికి ఈ నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కోర్సులను అందించనున్నారు.

విద్యార్థులతో పాటు, నిరుద్యోగ యువత, గృహిణులకు ఉపయోగపడేలా కోర్సులు అందిస్తున్నారు. ఇందులో భాగంగా 6 నెలల వ్యవధితో కూడిన కోర్సులు ఉంటాయి. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఇందులో భాగంగా ఆఫీస్‌ ఆటోమేషన్‌, టాలీ ప్రైమ్‌, బ్యూటీషియన్‌, పేజీమేకర్‌, ఫొటోషాప్‌, కోరల్‌ డ్రా, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, సీ లాంగ్వేజ్‌, పైథాన్‌, పేపర్‌ బ్యాగ్ మేకింగ్‌, హెర్బల్‌ ప్రొడక్ట్స్‌, ఫ్యాషన్‌ జువెలరీ, టైలరింగ్‌, హ్యాండ్‌ ఎంబ్రాడరీ, జూట్‌ బ్యాగ్ మేకింట్‌, ఫాబ్రిక్‌ పెయింటింగ్‌, మగ్గం వర్క్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ వంటి కోర్సులను అందిస్తారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ముందుగా ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికే అవకాశం ఉంటుంది. పరిమిత సంఖ్యలోనే సీట్లు ఉంటాయి. పూర్తి వివరాల కోసం 9951210441/ 9701098541 నెంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సంప్రదించవచ్చు. లిటరసీ హౌజ్‌, దుర్బాబాయ్‌ దేశ్‌ ముఖ్‌ మహిళా సభా ఉస్మానియా యూనివర్సిటీ రోడ్‌, హైదరాబాద్‌లో వాకిన్‌ జరగుతుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే