AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bitter Gourd: ఇలా చేశారంటే చాలు కాకరకాయలో చేదు అస్సలు ఉండదు.. పిల్లలు కూడా ఇష్టపడతారు!

Bitter Gourd: కాకరకాయలో చేదును పోగొట్టాలంటే వెరీ సింపుల్. వంటింట్లోనే ఇలా చేసినట్లయితే చేదు అస్సలు ఉండదు. పిల్లలు సైతం ఇష్టంగా తినేస్తారు. కాకరకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. మరి ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో మీకు తెలుసా..?

Subhash Goud
|

Updated on: Mar 11, 2026 | 11:51 AM

Share
 Bitter Gourd: కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు పదేపదే చెబుతుంటారు. కానీ కాకరకాయను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కారణం చేదుగా ఉండడమే. కానీ ఇందులో ఉండే పోషకాలు అంతా ఇంతా కావు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్న వారికి ఔషంగా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కాకరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది వైద్యులు కూడా వారానికి ఒకసారి అయినా కాకరకాయ తినాలని సిఫార్స్‌ చేస్తుంటారు. అయితే ఈ కూరలో చేదు వల్ల ఎవరూ దీన్ని తినేందుకు ఇష్టపడరు. కానీ కొన్ని టిప్స్‌తో కాకరకాయలో ఉండే  చేదును కూడా పోగొట్టవచ్చు. పిల్లలు సైతం తినేందుకు ఇష్టపడుతుంటారు. మరి ట్రిక్స్‌ ఏంటో తెలుసుకుందాం..

1 / 5
 ఇలా చేదును తగ్గించండి: కాకరకాయను కట్ చేసిన తర్వాత ఉప్పు రాసి కొంతసేపు పక్కన ఉంచాలి. చిన్న చిన్న ముక్కులుగా కోసి వాటికి ఉప్పు బాగా రాయాలి. తర్వాత వాటిని సుమారు 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. కొద్దిసేపటికి కాకరకాయ నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ నీటిని చేతితో పిండేస్తే చేదు దాదాపుగా తగ్గిపోతుంది.ఇలా చేసిన తర్వాత కాకరకాయతో చేసే వేపుడు, కూర లేదా పచ్చడి మరింత రుచిగా తయారవుతుంది.

2 / 5
 గింజలు తీసేయడం వల్ల చేదు తగ్గుతుంది: ఇక మరో చిట్కా ఏంటంటే కాకరకాయలో గింజలను తీసివేయడం వల్ల కూడా చేదు తగ్గుతుందట. సాధారణంగా కాకరకాయ లోపల ఉండే గింజలు, తెల్లని పొర ఎక్కువగా చేదుగా ఉంటుంది. అందుకే వంట చేయడానికి ముందు కాకరకాయను మధ్యలో కోసి గింజలు తీసేయడం మంచిది. అలాగే పై తొక్కను కూడా కొంచెం తురిమేస్తే చేదు తగ్గుతుంది.

3 / 5
 ఉప్పు కలిపిన నీటిలో ఉంచడం: ఇక కాకరకాయను ఉప్పు కలిపిన వేడి నీటిలో కొద్దిసేపు మరిగించడం వల్ల కూడా చేదు తగ్గుతుంది. ముక్కలుగా కట్ చేసిన కాకరకాయను వేడి నీటిలో 3 నుంచి 5 నిమిషాలు ఉంచి తీసేయాలి. తర్వాత వాటిని నీటితో కడిగి కూరగా వండితే చేదు తక్కువగా ఉంటుంది.

4 / 5
 ఇలా కూడా చేయండి: అలాగే కాకరకాయ కూర వండేటప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు ఎక్కువగా వేస్తే కూడా రుచి మారుతుంది. కొంతమంది చింతపండు రసం లేదా కొద్దిగా బెల్లం వేసి కాకరకాయ కూర చేస్తారు. ఇలా చేస్తే చేదు రుచి తగ్గి కూర తీపి,పులుపు కలిసిన రుచిగా ఉంటుంది. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటించడవ వల్ల కాకరకాయలో చేదును తగ్గించుకోవచ్చు.

5 / 5
Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన

భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..

క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..

సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో

అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం

ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం