AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ప్రేమతో దగ్గరికెళితే దూరంగా.. పెళ్లై 3 నెలలైనా ముట్టుకోని భర్త.. అదేంటని భార్య ప్రశ్నిస్తే..

అతను చూడటానికి బాగుంటాడు.. ఆమె కూడా అందంగానే ఉంటుంది.. పెళ్లి చూపుల్లోనే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఇరు కుటుంబాలు కలిసి వారికి పెళ్లిచేశారు. ఆమె కూడా ఎన్నో కలలు.. ఆకాంక్షలతో అతనితో కలిసి అత్తవారింట్లో అడుగుపెట్టింది. అయితే.. చూస్తుండంగానే మూడు నెలలు దాటింది. కానీ.. ముద్దు ముచ్చటలేదు..

Andhra: ప్రేమతో దగ్గరికెళితే దూరంగా.. పెళ్లై 3 నెలలైనా ముట్టుకోని భర్త.. అదేంటని భార్య ప్రశ్నిస్తే..
Marital Deception
Shaik Madar Saheb
|

Updated on: Mar 11, 2026 | 1:10 PM

Share

అతను చూడటానికి బాగుంటాడు.. ఆమె కూడా అందంగానే ఉంటుంది.. పెళ్లి చూపుల్లోనే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఇరు కుటుంబాలు కలిసి వారికి పెళ్లిచేశారు. ఆమె కూడా ఎన్నో కలలు.. ఆకాంక్షలతో అతనితో కలిసి అత్తవారింట్లో అడుగుపెట్టింది. అయితే.. చూస్తుండంగానే మూడు నెలలు దాటింది. కానీ.. ముద్దు ముచ్చటలేదు.. ఇదేంటంటూ ఆమె సిగ్గువిడిచి మరి.. సంసారం ఎందుకు చేయడం లేదని భర్తను నిలదీసింది.. ఏదో పైకి మనిషి కనపడుతున్నా.. లోపల మాత్రం.. అతని మ్యాటర్ వీక్.. దీంతో ఇదేంటంటూ ఆమె నిలదీసింది.. నపుంసకుడనే విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు..? పెళ్లి ఎందుకు చేశారు.. అంటూ ప్రశ్నిస్తే.. ఆమెపైనే తిరగబడ్డారు. చంపుతామని భర్త, అత్తమామలు ఆమెను బెదిరించారు. దీంతో ఆ నవ వధువు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది..

వివరాల ప్రకారం..

నంద్యాలకు చెందిన ఒక యువతి పంచాయతీ సెక్రటరీగా పని చేస్తోంది. ఆమెకు గత ఏడాది డిసెంబరు 26న కడప జిల్లాకు చెందిన ఓ యువకుడితో నంద్యాలలో పెళ్లిజరిగింది.. ముస్లిం సంప్రదాయం ప్రకారం వారి వివాహాన్ని జరిపించారు. పెద్దలు.. వరుడు విజయవాడలో ప్లానింగ్‌ సెక్రటరీగా పని చేస్తున్నాడు. అయితే.. పెళ్లికి ముందు రూ.15 లక్షల కట్నం, దుస్తులు.. మరికొన్ని వస్తువుల నిమిత్తం మరో రూ.లక్ష సైతం ముట్టజెప్పారు. పెళ్లి రోజున 5 తులాల బంగారు నగలు సైతం ఇచ్చారు. పెళ్లి ఘనంగా జరిగింది.. అనంతరం అతని ప్లాన్ మారింది.. రిసెప్షన్‌ రోజున పెళ్లికొడుకు పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు.. ఆ తర్వాత రోజు నుంచి రాత్రిళ్లు ఇంటికి రాకుండా, సంసారం చేయకుండా ముఖం చాటేస్తుండడంతో వధువు కుటుంబసభ్యులు నిలదీశారు.

అయితే.. తన తల్లిదండ్రులకు సేవ చేసేందుకే పెళ్లి చేసుకున్నానంటూ భార్యకు చెప్పిన అతను.. ఆమెను గవర్నర్‌పేటలోని సోదరుడి ఇంట్లో దించి వెళ్లిపోయాడు. అనంతరం భర్త గురించి పలు విషయాలను తెలుసుకుంది భార్య.. తన భర్త సంసారానికి పనికి రాడని.. ఆ విషయాన్ని దాచి పెట్టి వివాహం చేశారని తెలుసుకుంది..

అనంతరం ఇదే విషయంపై.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ సందర్భంగా యువతి కుటుంబసభ్యులు.. వరుడు..అతని కుటుంబసభ్యులను నిలదీశారు. అసలు విషయం బయటపడటంతో.. భర్తతోపాటు.. అత్తామామలు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ.. యువతి, ఆమె కుటుంబసభ్యులను బెదిరించారు. అంతేకాకుండా.. ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని.. బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us