జూన్ 4 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాలు పెరిగే ఛాన్స్..!
దిన ఫలాలు (జూన్ 4, 2026): గ్రహాల అనుకూల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగగా, వృషభ రాశి వారిపై అధికారుల విశ్వాసం మరింత బలపడుతుంది. మిథున రాశి వారికి జీతభత్యాల పెరుగుదల సూచనలు కనిపిస్తున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి గురువారంనాటి పూర్తి రాశిఫలాలను తెలుసుకోండి.

దిన ఫలాలు (జూన్ 4, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా లభిస్తుంది. వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. వృషభ రాశి వారిపై పై అధికారులకు నమ్మకం బాగా పెరుగుతుంది. ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ప్రయత్న లోపం లేకపోతే ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా లభిస్తుంది. వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. పోటీదార్ల బెడద చాలా వరకు తగ్గుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. కోపతాపాలను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు బాగుంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులుంటాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ నమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోకుండా కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీ సలహాలు, సూచనల ద్వారా లబ్ధి పొందుతారు. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. రావలసిన డబ్బు చేతికి అంది, ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఊరట లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపా రాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. మీ మాట చెలామణీ అవుతుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలుంటాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా సంపాదన పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు సన్నిహితులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. బంధువుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవడం చాలా మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో సొంత ఆలోచనలు మంచివి. అనుకో కుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారం అవుతాయి. కొత్త నిర్ణయాలకు, కొత్త వ్యూహాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రుల్ని కలసుకుంటారు. రోజంతా హ్యాపీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాలకు హాజరవుతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో సహోద్యోగులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మైన మార్పులు చేపడతారు. ఎవరి వివాదాల్లోనూ తలదూర్చకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల ద్వారా ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృథా ఖర్చులు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.