AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: థియేటర్లలో దుమ్మురేపుతున్న పెద్ది.. రామ్ చరణ్ సినిమాపై సెలబ్రెటీస్ రియాక్షన్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన సమంత..

ఎట్టకేలకు మెగా ఫ్యాన్స్, పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెద్ది సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. జూన్ 3 రాత్రి నుంచి ప్రీమియర్స్ పడగా.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రీమియర్స్ చూసిన అడియన్స్ ఇప్పటికే ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ సెలబ్రెటీస్ పెద్ది పై ఆసక్తికర ట్వీట్స్ చేశారు.

Peddi Movie: థియేటర్లలో దుమ్మురేపుతున్న పెద్ది.. రామ్ చరణ్ సినిమాపై సెలబ్రెటీస్ రియాక్షన్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన సమంత..
Peddi Movie News
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2026 | 6:34 AM

Share

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘పెద్ది’. సినిమా అనౌన్స్‌మెంట్‌ నాటి నుంచే ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 4 (గురువారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టింది. బుధవారం రాత్రి నుంచే దేశవిదేశాల్లోని ప్రముఖ నగరాల్లో ప్రీమియర్ షోల సందడి మొదలైపోయింది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన మెగా ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా చరణ్ బాడీ ట్రాన్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే, ‘పెద్ది’ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించాలంటూ చిత్ర బృందానికి టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖ సినీ నటులు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

వరుణ్ తేజ్: చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ, “ఈ సినిమా కోసం రామ్‌చరణ్‌ అన్న ఎంతగా శ్రమించాడో నాకు వ్యక్తిగతంగా తెలుసు. అన్న.. పని పట్ల మీకున్న అంకితభావం, నిబద్ధత నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. బుచ్చిబాబు, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్‌ రెహమాన్‌తో పాటు టీమ్‌ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘పెద్ది’ బ్యాటింగ్‌ స్టార్ట్ అయ్యింది.. సినిమా చాలా పెద్ద విజయం అందుకోవాలి” అంటూ ఫైర్ ఎమోజీలను జత చేశారు.

వరుణ్ తేజ్ ట్వీట్..

సమంత: రామ్‌చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ స్పందించారు. “ఇది ఖచ్చితంగా ‘పెద్ది’ టైమ్‌. ఈ చిత్రం చూడటం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చరణ్‌ పెర్ఫామెన్స్ ఈ సినిమాలో అదిరిపోతుంది. ఆయన ఎంతో సూపర్‌టాలెంటెడ్‌ యాక్టర్. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నాకు ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌ వైబ్స్‌ కనిపిస్తున్నాయి” అని పోస్ట్ చేశారు.

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

అనిల్ రావిపూడి: దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ, “సినిమా ప్రారంభమైన మొదటి రోజు నుంచే ‘పెద్ది’ ప్రయాణం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమా కోసం రామ్‌చరణ్‌ చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆయన చూపించిన కమిట్‌మెంట్‌, డెడికేషన్ నిజంగా అసాధారణమైనవి. ‘పెద్ది’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి, కొన్నాళ్లపాటు గుర్తుండిపోయే ఓ మైలురాయిగా, వేడుకగా నిలవాలని ఆశిస్తున్నా” అని తెలిపారు.

అనిల్ రావిపూడి ట్వీట్..

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

Follow Us
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు