AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

చిత్రమ్, మనసంతా నువ్వే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రీమా సేన్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత విశేషాలపై ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మోడలింగ్ నుండి నటన వరకు, తేజ గారితో పని అనుభవం, వంటపట్ల ఆమె అభిరుచి, అలాగే కెరీర్‌లో ఎదురైన రూమర్స్‌పై ఆమె అభిప్రాయాలను వెల్లడించారు.

Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..
Reema Sen
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2026 | 10:58 AM

Share

డైరెక్టర్ తేజ సంచలన చిత్రం ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, తన గ్లామర్, నటనతో మెప్పించిన హీరోయిన్ రీమా సేన్. ఆ తర్వాత ‘మనసంతా నువ్వే’, ‘అదృష్టం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ, గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కో-స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ , దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కెరీర్‌లో వర్క్ చేసిన స్టార్ హీరోల గురించి రీమా సేన్ మాట్లాడుతూ.. మొదటగా తన తొలి చిత్రం ‘చిత్రం’ , ‘మనసంతా నువ్వే’ కో-స్టార్ ఉదయ్ కిరణ్ గురించి ప్రస్తావించారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ఉదయ్ కిరణ్ చాలా సైలెంట్ పర్సన్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన ఒక ఇంట్రోవర్ట్ (ఎక్కువగా మాట్లాడని వ్యక్తి) అని, సెట్స్‌లో ఎంతో పద్ధతిగా, మర్యాదపూర్వకంగా ప్రవర్తించేవారని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ ఎంతో ప్రైమ్ అండ్ ప్రాపర్‌గా ఉంటూ, “రీమా గారు.. ఎలా ఉన్నారు?” అంటూ చాలా సాఫ్ట్‌గా మాట్లాడేవారని ఆమె తెలిపారు. ఇక మాస్ మహారాజా రవితేజ గురించి రీమా సేన్ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. రవితేజ తనకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరని ఆమె స్పష్టం చేశారు. ‘అదృష్టం’ , ‘వీడే’ చిత్రాలలో రవితేజతో కలిసి నటించిన రీమా.. ఆయనతో ఉన్న బాండింగ్ గురించి చెప్తూ, “రవితేజ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. ఆయనతో నాకు చాలా గొప్ప ఫ్రెండ్‌షిప్ ఉంది” అని చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలోనే కాకుండా, పర్సనల్‌గా కూడా రవితేజ ఎంతో సపోర్టివ్‌గా ఉంటారని ఆమె ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ఈ ఇంటర్వ్యూలో కో-స్టార్స్‌తో అనుబంధం మాత్రమే కాకుండా హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంత ఇష్టమో కూడా రీమా సేన్ పంచుకున్నారు. సెట్స్‌లో తన మూడ్ బాలేనప్పుడు మేకర్స్ బిర్యానీ తెప్పించి తనను ఖుషీ చేసేవారని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా, టాలీవుడ్ యంగ్ చాక్లెట్ బాయ్ ఉదయ్ కిరణ్ సున్నిత మనస్తత్వం గురించి, అలాగే మాస్ రాజా రవితేజతో ఉన్న క్లోజ్ ఫ్రెండ్‌షిప్ గురించి రీమా సేన్ మాట్లాడిన ఈ పాత జ్ఞాపకాలు మెగా అభిమానులను, సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

రీమా సేన్ బెస్ట్ ఫ్రెండ్..

Reema Sen, Ravi Teja

Reema Sen, Ravi Teja

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us