AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

రాఘవ లారెన్స్ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. డ్యాన్స్ మాస్టర్ గా సినీరంగంలోకి అడుగుపెట్టి.. అటు నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా తనదైన ముద్ర వేశారు. 1999లో వచ్చిన 'స్పీడ్ డాన్సర్' అనే తెలుగు చిత్రంతో నటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత స్టైల్ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా లారెన్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..
Raghava Lawrence
Rajitha Chanti
|

Updated on: May 29, 2026 | 9:07 PM

Share

కోలీవుడ్ , టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. నటుడిగా, డ్యాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా రాఘవ లారెన్స్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. సాధారణంగా తన సినిమాలతో, అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించే లారెన్స్, వ్యక్తిగత విషయాల్లో చాలా నిరాడంబరంగా ఉంటారు. ఓవైపు సినిమాల్లో నటించడం.. మరోవైపు సామాజిక సేవ చేయడంలో బిజీగా ఉంటారు. ఇప్పటివరకు ఎంతో మందికి తనవంతు సాయం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఆయన తన భార్య లతతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

రాఘవ లారెన్స్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. డ్యాన్స్ మాస్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, తన కష్టంతో, ప్రతిభతో నటుడిగా, దర్శకుడిగా ఎదిగారు. 1999లో వచ్చిన ‘స్పీడ్ డ్యాన్సర్’ అనే తెలుగు సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళంలో ‘ఉన్నై కొడు ఎన్నై తరువెన్’ వంటి సినిమాలతో తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘ముని’ సినిమాతో దర్శకుడిగా మారి, ఆ తర్వాత ‘కాంచన’ సిరీస్‌తో హారర్-కామెడీ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, లారెన్స్ తన కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలలో లారెన్స్, ఆయన భార్య లత ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఇన్నాళ్లూ ఎక్కువగా బయట కనిపించని లారెన్స్ భార్య ఫోటోలను చూసిన అభిమానులు, వారిద్దరి జంటను చూసి మురిసిపోతున్నారు. ప్రస్తుతం లారెన్స్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఆయన చివరగా పి.వాసు దర్శకత్వంలో ‘చంద్రముఖి 2’ కనిపించారు. తాజాగా లారెన్స్ పెళ్లి రోజు కావడంతో ఫ్యాన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

రాఘవ లారెన్స్ భార్య ఫోటో..

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

Follow Us