AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని కమెడియన్ సుమన్ శెట్టి. జయం సినిమాతో వెండితెరపై తనదైన నటనతో మెప్పించిన ఆయన .. తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుమన్.. ఇటీవల బిగ్ బాస్ రియాల్టీ షోతో రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..
Suman Shetty
Rajitha Chanti
|

Updated on: May 27, 2026 | 7:45 PM

Share

టాలీవుడ్‌లో ఒకప్పుడు తనదైన మార్క్ కామెడీ టైమింగ్, ఇన్నోసెంట్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సుమన్ శెట్టి. జయం సినిమాలో అధ్యక్షా అనే డైలాగ్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో సుమన్ శెట్టి యాక్టింగ్, కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ‘ఔనన్నా కాదన్నా’, ‘7G బృందావన్ కాలనీ’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ అనుహ్యంగా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే వెండితెరకు కాస్త దూరమయ్యారు. అయితే ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్-9 (Bigg Boss 9) లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన పాత జ్ఞాపకాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుని మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మిగతా భాషలలో వరుస సినిమాలు చేయడంతో తాను తెలుగు సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అన్నారు. అయితే ఈ క్రమంలోనే తాను కోటీశ్వరుడు కావడానికి , సొంత ఇల్లు కొనుక్కోవడానికి వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆయన బయటపెట్టారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

సుమన్ శెట్టిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి, వరుసగా తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చింది క్రేజీ డైరెక్టర్ తేజ. ‘జయం’ సినిమాతో వచ్చిన ఫేమ్‌తో సుమన్ శెట్టికి బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు వచ్చాయి. ఆ సమయంలో విపరీతంగా డబ్బు సంపాదిస్తున్న సుమన్ శెట్టి ఒకసారి డైరెక్టర్ తేజ దగ్గరకు వెళ్లి కృతజ్ఞతగా ఆయన కాళ్లకు నమస్కరించబోయారట. “నాకు లైఫ్ ఇచ్చారు సార్.. మీ కోసం నేను ఏం చేయాలి?” అని అడిగారట. దానికి తేజ ఎంతో ప్రాక్టికల్‌గా ఆలోచించి ఒక అద్భుతమైన సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. “నాకు నువ్వేం ఇవ్వక్కర్లేదు.. సంపాదించిన డబ్బుతో హైదరాబాద్‌లో రేట్లు తక్కువగా ఉన్నప్పుడే మంచి ఇల్లు కొనుక్కో (రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చెయ్). అందులో నాకోసం ఒక రూమ్ కేటాయించు. భవిష్యత్తులో నేను సినిమాలు లేక రోడ్డున పడితే నీ ఇంటికి వచ్చి ఆ రూమ్‌లోనే ఉంటా” అని సరదాగా చెబుతూనే లైఫ్ సెటిల్ అయ్యే సలహా ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : ఏంటీ.. ఈ నటుడు వైఎస్ఆర్ క్లోజ్ ఫ్రెండ్ ఆ.. ? సినిమాలకు బలవంతంగా తీసుకెళ్లేవారట.

డైరెక్టర్ మాటను వేదవాక్కుగా భావించిన సుమన్ శెట్టి, వెంటనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి మణికొండలో ఇల్లు కొనుగోలు చేశారు. తేజ ఇచ్చిన ఆనాటి సలహా వల్లే తాను ఈరోజు కోటీశ్వరుడిగా స్థిరపడ్డానని సుమన్ శెట్టి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు అక్కడ స్థలం ధర దాదాపు వందరెట్లు పెరిగిందని అన్నారు. గురువుపై ఉన్న భక్తితో ఇప్పటికీ తన ఇంట్లో తేజ కోసం ఒక ప్రత్యేకమైన రూమ్ ఉంచి, అందులో ఆయన ఫోటో పెట్టుకుని రోజూ పూజిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గతంలో తేజ కూడా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు దారి చూపడమే కాకుండా, భవిష్యత్తుకు భరోసానిచ్చేలా తేజ ఇచ్చిన ఈ సలహా, సుమన్ శెట్టి చూపించిన ఈ గురుభక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Vantalakka: నా భర్త నాతో కలిసి ఉండడు.. కారణం అదే.. కార్తీక దీపం వంటలక్క కామెంట్స్..

Follow Us