Tollywood : వైఎస్ఆర్ను నేనే బలవంతగా సినిమాలకు తీసుకెళ్లేవాడిని.. టాలీవుడ్ నటుడు..
సినీరంగంలో చాలా మంది నటీనటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పలువురు స్టార్ కమెడియన్స్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటుడు అటు సినీరంగంలో, ఇటు రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ, రాజకీయ జీవితంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని మారుమూల కొమ్మినేనిపాలెం నుండి వచ్చి, తన కృషి, ప్రతిభతో సినీరంగంలో విశేష గుర్తింపు పొందిన ప్రయాణాన్ని ఆయన వివరించారు. తెరపై కనిపించినా నవ్వు తెప్పించగల తన వ్యక్తిత్వాన్ని, మరోవైపు రాజకీయ రంగంలో తన ప్రమేయాన్ని బ్యాలెన్స్ చేయడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తన నైజం సీరియస్‌నెస్ కాగా, తన వృత్తి హాస్యం అని పేర్కొన్నారు. రాజకీయాలలో తాను “తామరాకుపై నీటిబొట్టులా” వ్యవహరించానని తెలిపారు. రాజకీయాల వల్ల ఎలాంటి ప్రయోజనాలను తాను ఎప్పుడూ ఆశించలేదని, పదవుల పరంగా లబ్ధి పొందానంటే అది కేవలం దివంగత ముఖ్యమంత్రి YSRతో తనకున్న 20 ఏళ్ల సాన్నిహిత్యం వల్లేనని స్పష్టం చేశారు. YSR అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పిలిచి ఒక పదవిని అప్పగించారని, ఆ పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. YSR తన అభిరుచిని గుర్తించి ఈ పదవి బాగుంటుందని భావించారని ఆయన తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..
YSRతో తన సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ, ఎంత ఒత్తిడిలోనైనా హాయిగా నవ్వగల సత్తా ఉన్న నాయకుల్లో YSR ఒక్కరేనని సుబ్రహ్మణ్యం అన్నారు. తాను వైఎస్ఆర్ ను సినిమాలకు తీసుకెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. సినిమా తనను నడిపితే, రాజకీయాలను మాత్రం తాను నడుపుకున్నానని, తనకంటూ కొన్ని పరిధులు పెట్టుకున్నానని వివరించారు. ముఖ్యంగా “పరదూషణ వద్దు” అనే సూత్రాన్ని ఆయన మొదటి ప్రిన్సిపల్‌గా పెట్టుకున్నట్లు తెలిపారు. నాటక రంగ అనుభవం తన నటనకు, విశిష్టమైన డైలాగ్ డెలివరీకి, టైమింగ్‌కు ఎంతగానో ఉపకరించిందని సుబ్రహ్మణ్యం తెలిపారు. తాను ప్రజానాట్య మండలి ద్వారా నాటక రంగానికి వచ్చానని, అది విస్తృతమైన మానవ సంబంధాలను పరిచయం చేసిందని నల్లూరి వెంకటేశ్వర్లును గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..
సినీ జీవితానికి సంబంధించి, సాయంత్రం ఆరు గంటల తర్వాత సినిమా ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకుంటానని, సహనటులతో కలిసి కూర్చోవడం వంటివి ఎప్పుడూ చేయనని వెల్లడించారు. 700కు పైగా సినిమాలు చేసినా, ఆడియో లేదా అవార్డు ఫంక్షన్లకు వందసార్లు వెళ్లాల్సి వస్తే ఒక్కసారి మాత్రమే వెళ్తానని, అది కూడా చూజీగానే ఉంటుందని చెప్పారు. “సైనికుడు” సినిమా డబ్బింగ్ కరెక్షన్ కోసం అర్థరాత్రి ఫోన్ వచ్చినప్పుడు, తర్వాతి రోజు ఉదయం వస్తానని దృఢంగా చెప్పిన సంఘటనను ఆయన ఉదాహరణగా వివరించారు. ఇది మూర్ఖత్వం కాదని, తన అలవాట్లు, సూత్రాలకు తాను కట్టుబడి ఉంటానని ధర్మవరపు సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : జయం సినిమాను మిస్ అయ్యింది.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యేది.. యాంకరమ్మ బ్యాడ్ లక్..

Dharmavarapu Subramanyam Mo
