AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram : ఆ పుస్తకం నాలో తెలియని ఆవేశం తెప్పించింది.. త్రివిక్రమ్ ఫస్ట్ చదివిన బుక్ అదే..

టాలీవుడ్‌లో 'మాటల మాంత్రికుడు'గా పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లోని డైలాగ్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఆయన రాసే ప్రతి మాట వెనుక ఎంతో లోతైన అర్థం దాగి ఉంటుంది. త్రివిక్రమ్‌కు పుస్తకాలు చదవడం, అంటే ఎంత ఇష్టమో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఆయన ఒక గొప్ప పుస్తక ప్రేమికుడు. వివిధ సందర్భాల్లో, ఇంటర్వ్యూలలో పుస్తకాల ప్రాధాన్యత గురించి, అవి మనిషి జీవితాన్ని ఎలా మారుస్తాయనే దానిపై త్రివిక్రమ్ చెప్పిన మాటలు ఇప్పుడు తెలుసుకుందామా.

Trivikram : ఆ పుస్తకం నాలో తెలియని ఆవేశం తెప్పించింది.. త్రివిక్రమ్ ఫస్ట్ చదివిన బుక్ అదే..
Trivikram Srinivas
Rajitha Chanti
|

Updated on: May 28, 2026 | 4:04 PM

Share

మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పుస్తకాలంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లోని లోతైన డైలాగ్స్ వెనుక ఆయన చదివిన వేలాది పుస్తకాల జ్ఞానం దాగి ఉందన్నది అక్షర సత్యం. అయితే, ఇంత పెద్ద రైటర్ , డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తన జీవితంలో చదివిన అతి మొదటి పుస్తకం ఏంటో తెలుసా? గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల గురించి చెప్పుకొచ్చాడు. “మీరు మీ జీవితంలో చదివిన మొట్టమొదటి పుస్తకం ఏంటో మీకు గుర్తుందా?” అని సదరు యాంకర్ అడగ్గా.. . దానికి త్రివిక్రమ్ స్పందిస్తూ.. తాను చదివిన తొలి పుస్తకం తెలుగు సాహిత్యంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన కవిత్వ గ్రంథం అయిన తిలక్ రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’ అని వెల్లడించారు. . “ఆ పుస్తకాన్ని నాకు ఎవరూ ప్రత్యేకంగా పరిచయం చేయలేదు. మా నాన్నగారు ఎప్పుడో కొని చదివిన ఆ పుస్తకం మా ఇంట్లోనే ఉంది. నేను ఏడో తరగతి చదువుతున్న సమయంలో ఆ పుస్తకాన్ని మొదటిసారి చూశాను. అప్పట్లో అందులో ఉన్న కవిత్వం, భావాలు నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆ లైన్స్ చదువుతుంటే నాలో ఒక తెలియని ఆవేశం, ఉత్సాహం వచ్చాయి” అని గుర్తుచేసుకున్నారు.

అంతేకాదు, ఆ పుస్తకం చదివిన ఇన్సిపిరేషన్‌తో తాను కూడా బాల్యంలోనే కవిత్వం రాయడానికి ప్రయత్నించానని త్రివిక్రమ్ నవ్వుతూ చెప్పారు. “ఆ పుస్తకంలోని శైలిని ఇమిటేట్ చేస్తూ అటు ఇటుగా నేనేదో కొన్ని కవితలు రాసేశాను. అయితే ఆ తర్వాత కాలంలో అవన్నీ నాకే నచ్చక చింపేశాననుకోండి.. అది వేరే విషయం” అంటూ తన బాల్యపు జ్ఞాపకాలను సరదాగా పంచుకున్నారు. త్రివిక్రమ్ లాంటి ఒక గొప్ప రచయిత ప్రస్థానం ‘అమృతం కురిసిన రాత్రి’ వంటి అద్భుతమైన పుస్తకంతోనే మొదలైందని తెలిసి నెటిజన్లు, ఆయన అభిమానులు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.

అలాగే త్రివిక్రమ్ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కచ్చితంగా చదవాల్సిన 5 అద్భుతమైన తెలుగు పుస్తకాలను/నవలలను రికమెండ్ చేశారు.

వేయి పడగలు (విశ్వనాథ సత్యనారాయణ):

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నవల ఇది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు మార్పుల నేపథ్యంలో సాగే ఈ గొప్ప కావ్యాన్ని త్రివిక్రమ్ ఫస్ట్ ఆప్షన్‌గా “నో డౌట్.. కచ్చితంగా చదవాల్సిందే” అని రికమెండ్ చేశారు.

చివరికి మిగిలేది (బుచ్చిబాబు):

తెలుగు నవలా సాహిత్యంలో మనస్తత్వ విశ్లేషణకు అద్దం పట్టే ఒక అద్భుతమైన నవల ఇది. మనుషుల ఆలోచనలు, అంతర్మథనం, జీవితం పరమార్థాన్ని బుచ్చిబాబు గారు ఇందులో ఎంతో లోతుగా ఆవిష్కరించారు.

మైనా (శీలా వీర్రాజు):

విశిష్ట రచయిత శీలా వీర్రాజు గారు రాసిన ‘మైనా’ నవల కూడా త్రివిక్రమ్‌కు ఎంతో ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి. మానవీయ సంబంధాలు, గ్రామీణ నేపథ్యం , మనసుకు హత్తుకునే కథనంతో సాగే ఈ నవల ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

కీర్తి కిరీటాలు (యద్దనపూడి సులోచనారాణి):

తెలుగు నవలా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శకాన్ని సృష్టించిన ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారి కలం నుండి వచ్చిన అద్భుతమైన రచన కీర్తి కిరీటాలు’. కళాకారుల జీవితాలు, వారి అంతరంగిక ఘర్షణల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

కాలాతీత వ్యక్తులు (డాక్టర్ పి. శ్రీదేవి):

మరో ప్రసిద్ధ నవల అయిన ‘కాలాతీత వ్యక్తులు’ పుస్తకాన్ని కూడా త్రివిక్రమ్ ఈ లిస్ట్‌లో చేర్చారు. 1960ల నాటి సమాజం, స్త్రీల ఆలోచనా విధానం, ఆనాటి సామాజిక మార్పులను డాక్టర్ పి. శ్రీదేవి గారు ఈ నవలలో ఎంతో చక్కగా వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

ఎక్కువ మంది చదివినవి : ఏంటీ.. ఈ నటుడు వైఎస్ఆర్ క్లోజ్ ఫ్రెండ్ ఆ.. ? సినిమాలకు బలవంతంగా తీసుకెళ్లేవారట.

Follow Us