AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

కోలీవుడ్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. గజిని, ఆరు, 7th సెన్స్ వంటి చిత్రాలతో తెలుగులో తనదైన ముద్ర వేశాడు సూర్య. ఇటీవలే కరుప్పు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ సినిమా ప్రమోషనల్లో టాలీవుడ్ హీరోలతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..
Suriya
Rajitha Chanti
|

Updated on: May 29, 2026 | 4:27 PM

Share

సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుల మధ్య ఉండే స్నేహ బంధాలు ఎప్పుడూ ప్రేక్షకులలో అమితమైన ఆసక్తిని కలిగిస్తాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మధ్య ఉన్న ఒక అరుదైన పాత జ్ఞాపకం గురించి సూర్య స్వయంగా పంచుకున్న విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సూర్య, మహేష్ బాబుతో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సూర్య మాట్లాడుతూ, తామంతా ఒకే పాఠశాలలో చదువుకున్నామని వెల్లడించారు. “నేను, సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అందరం చెన్నైలోని ప్రసిద్ధ ‘సెయింట్ బెడెస్’ (St. Bede’s) స్కూల్‌లోనే చదువుకున్నాం. మహేష్ బాబు నా క్లాస్‌మేట్” అని సూర్య చెప్పుకొచ్చారు. యువన్ శంకర్ రాజాతో కూడా తనకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉందని, అతను చిన్న వయసులో కుర్చీ పైకి ఎక్కి పియానో వాయించే రోజులను తాను చూశానని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

ఒకే స్కూల్‌లో చదువుకోవడం వల్ల వారి మధ్య ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని సూర్య తెలిపారు. చిన్ననాటి నుంచి కలిసి ప్రయాణం చేసిన మిత్రులంతా ఇప్పుడు సినిమా రంగంలో వేర్వేరుగా స్థిరపడి, ఎవరికి వారు అగ్ర స్థానాలలో కొనసాగడం ఎంతో గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. యువన్ శంకర్ రాజాతో ఉన్న 18 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ అనుబంధాన్ని, తన ఎదుగుదలలో అతని సంగీతం పోషించిన పాత్రను సూర్య ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

ఒకే పాఠశాల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈరోజు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతుండటం వారి అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు, సూర్య ఇద్దరూ క్లాస్‌మేట్స్ అనే విషయం సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఇటీవలే కరుప్పు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూర్య.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

సూర్య, మహేష్ బాబు ఫోటో.. 

Suriya, Mahesh Babu

Suriya, Mahesh Babu

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Follow Us