Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి మహేశ్వరి. 90వ దశకంలో అగ్ర హీరోయిన్లలో ఆమె ఒకరు. హోమ్లీ లుక్స్‌తో పాటు గ్లామరస్ పాత్రలలోనూ ఒదిగిపోతూ, అప్పట్లో ఉన్న టాప్ అండ్ యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ప్రముఖ నటి శ్రీదేవికి ఈమె చెల్లెలి కూతురు (మేనకోడలు) కావడం విశేషం. కృష్ణవంశీ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘గులాబీ’ (1995) చిత్రంతో మహేశ్వరి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.

90వ దశకంలో తన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల కలల రాణిగా వెలిగిన హీరోయిన్ మహేశ్వరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘అమ్మాయి కాపురం’ చిత్రంతో పరిచయమై, ‘గులాబీ’, ‘పెళ్లి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆమె, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మహేశ్వరి, తన కెరీర్ నాటి ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ షోలో మహేశ్వరి మాట్లాడుతూ, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) పై తనకు ఉన్న క్రష్ గురించి సరదాగా వెల్లడించారు. అప్పట్లో అజిత్‌తో కలిసి నటించినప్పుడు, ఆయన వ్యక్తిత్వానికి, లుక్స్‌కు తాను ముగ్ధురాలినైపోయానని ఆమె చెప్పారు. అజిత్ అంటే తనకు చాలా ఇష్టమని, షూటింగ్ సమయంలో ఆయనపై మనసు పడ్డానని మహేశ్వరి పేర్కొన్నారు. అయితే, ఈ విషయాన్ని అజిత్‌కు చెప్పే లోపే ఒక ఊహించని సంఘటన జరిగిందట.
ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..
సినిమా షూటింగ్ చివరి రోజున అజిత్ తన దగ్గరకు వచ్చి, “నీ నటన నాకు చాలా నచ్చింది. భవిష్యత్తులో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు.. నువ్వు నాకు చెల్లిలాంటిదానివి” అని అన్నారట. ఆయన నోటి నుంచి ఆ మాట వినగానే తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, తను మనసులో అనుకున్న విషయాన్ని అజిత్ తన మాటలతో చెల్లీ అంటూ క్లారిటీ ఇచ్చేశారని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ మహేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..
మహేశ్వరిని తెరపై చూసి చాలా ఏళ్లయినా, ఆమె పంచుకున్న ఈ పాత తరం సినీ విశేషాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నటిగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, తనదైన శైలిలో మెప్పించిన మహేశ్వరి, ఇప్పుడు ఇలా తన వ్యక్తిగత ఇష్టాలను, సరదా జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోవడం విశేషం. ప్రస్తుతం మహేశ్వరి సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. అలాగే తన అక్క కూతురు జాన్వీ కపూర్ తో కలిసి సందడి చేస్తుంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
మహేశ్వరి క్రష్..

Maheshwari, Ajith
ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..
