Job Offer: ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ ఆఫర్.. ఉతికి ఆరేస్తున్న నెటిజనులు.. కారణమేమిటంటే..

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల విషయంలో అనుసరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల పెంపుదల సక్రమంగా లేకపోవడంతో ఆ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్లకు ఏడాదికి రూ.2.5 లక్షల జీతం మాత్రమే ఆఫర్ చేస్తోంది. అంటే నెలకు కేవలం రూ.20 వేలు మాత్రమే.

Job Offer: ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ ఆఫర్.. ఉతికి ఆరేస్తున్న నెటిజనులు.. కారణమేమిటంటే..
Software Job
Follow us
Madhu

|

Updated on: Aug 17, 2024 | 7:11 AM

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అధిక మొత్తంలో జీతాలు, వసతులు, లగ్జరీ లైఫ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీంతో యువత అందరూ సాఫ్ట్ వేర్ కొలువులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. లక్షల రూపాయల జీతాలు రావడంతో జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. కానీ ఇదంతా గతంలో పరిస్థితి. ప్రస్తుతం మారిపోయింది. సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎప్పుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తారో, ఎప్పుడు వేతనాలు పెంచుతారో తెలియడం లేదు. ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ అనుసరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.

కాగ్నిజెంట్ కంపెనీ..

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల విషయంలో అనుసరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల పెంపుదల సక్రమంగా లేకపోవడంతో ఆ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్లకు ఏడాదికి రూ.2.5 లక్షల జీతం మాత్రమే ఆఫర్ చేస్తోంది. అంటే నెలకు కేవలం రూ.20 వేలు మాత్రమే. ఆ డబ్బులు ఉద్యోగుల ఖర్చులకైనా వస్తాయా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మహా నగరాల్లో రోజు వారి కూలి పనిచేసుకునే వారు సైతం రోజుకు రూ.1000 నుంచి 1500 సంపాదిస్తారు. వారితో పోల్చితే ఫ్రెషర్లకు ఇచ్చే జీతం బాగా తక్కువ. కాగ్నిజెంట్ ఇచ్చిన ఈ ఆఫర్ పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి.

జీతాల పెంపుపై విమర్శలు..

కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన మరో విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఉద్యోగుల జీతాలను పెంచింది. ఇది మంచి విషయమే అయినప్పటికీ దీని వెనుక విస్మయం కలిగించే అంశం దాగుంది. మూడు రేటింగ్ పనితీరు కలిగిన ఉద్యోగులకు 1 నుంచి 3 శాతం, నాలుగు రేటింగ్ కలిగిన ఉద్యోగులకు 4 శాతం, ఐదుగురు టాప్ రేటింగ్ ఉద్యోగులకు ఐదుశాతం మాత్రమే పెంచారు. అంటే కనిష్టంగా ఒక శాతం నుంచి గరిష్టంగా ఐదు శాతానికి మాత్రమే జీతాలు పెరిగాయి.

మరీ ఇంత తక్కువా..

నగరాల్లో జీవితం, పిల్లల చదువులు, పెరుగుతున్న జీవన వ్యయం నేపథ్యంలో కాగ్నిజెంట్ సంస్థ పెంచిన జీతాలపై అందరూ కామెంట్లు చేస్తున్నారు. పేరు చెప్పడానికి ఇష్టపడని కంపెనీలు ఉద్యోగులు ఈ విషయాన్ని బయటకు వెల్లడించారు. 2023 ఏప్రిల్ లో కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు 7 నుంచి 11 శాతం జీతాలను పెంచింది. దీనితో పోల్చితే ఈ సారి మరీ తక్కువగా ఉంది.

లాభం వివరాలు..

కాగ్నిజెంట్ కంపెనీకి దేశంలో 254,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 70 శాతం వాటా కలిగి ఉంది. ఇటీవల జూన్‌తో ముగిసే త్రైమాసికం నాటికి ప్రపంచ ఉద్యోగుల సంఖ్య 336,300కి చేరుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్యను 8,100 తగ్గించినట్లు నివేదించింది. జూన్‌తో ముగిసిన రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలలో కాగ్నిజెంట్ నికర లాభంలో సంవత్సరానికి 22.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది, ఇది 3.6 శాతం క్రమానుగత వృద్ధితో పాటు 566 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

యువతకు నిరాశ..

కాగ్నిజెంట్ ఇటీవల చేపట్టిన ఆఫ్ క్యాంపస్ నియామక కార్యక్రమంపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తాజా గ్రాడ్యుయేట్లకు ఏడాదికి రూ. 2.5 లక్షల (ఎల్పీఏ) ప్రవేశ స్థాయి జీతం ఆఫర్ చేయడమే దీనికి కారణం. ఈ కంపెనీకి ప్రముఖ గ్లోబల్ ఐటీ సంస్థగా హోదా ఉంది. కానీ 2002 నుంచి కూాడా ఇదే జీతం స్థాయిని కొనసాగిస్తోంది. ఇది యువతకు అసంతృప్తిని కలిగించే విషయం. ప్రస్తుతం నెలకొన్న అనేక ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో తక్కువ ప్రారంభ వేతనంపై వారు విచారణ వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..