AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: తక్కువ పెట్టుబడితో ట్రెండీ బిజినెస్‌! క్లిక్‌ అయితే మీ ధనవంతులు అయిపోయినట్లే..

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలనుకునే వారికి క్లౌడ్ కిచెన్ వ్యాపారం ఒక ట్రెండీ అవకాశం. ఇంట్లో నుంచే వంట చేసి ఆన్‌లైన్ డెలివరీ యాప్‌ల ద్వారా విక్రయించే ఈ వ్యాపారం యువతలో ప్రజాదరణ పొందుతోంది. రూ. 20,000-50,000 పెట్టుబడితో ప్రారంభించి, అద్దె ఖర్చులు లేకుండా మంచి ఆదాయం పొందవచ్చు.

Business Idea: తక్కువ పెట్టుబడితో ట్రెండీ బిజినెస్‌! క్లిక్‌ అయితే మీ ధనవంతులు అయిపోయినట్లే..
Personal Finance: ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తెకు సురక్షితమైన, బలమైన భవిష్యత్తును కోరుకుంటున్నారు. ఈ ఆలోచనతోనే ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (SSY)ను ప్రారంభించింది. ఈ పథకం సురక్షితమైన పెట్టుబడి అవకాశాన్ని అందించడమే కాకుండా, కాలక్రమేణా డబ్బు వేగంగా పెరగడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఈ పథకంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీని కోసం మీరు పూర్తి 21 సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం అని భావించి చాలా మంది దీనికి దూరంగా ఉంటారు. కానీ నిజం ఏమిటంటే దీనికి కేవలం 15 సంవత్సరాల పెట్టుబడి కాలం మాత్రమే అవసరం. ఆ తర్వాత మీ డబ్బు తదుపరి ఆరు సంవత్సరాల పాటు ఎటువంటి ప్రయత్నం లేకుండానే పెరుగుతూనే ఉంటుంది.
SN Pasha
|

Updated on: Mar 08, 2026 | 9:00 AM

Share

తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి ఆదాయం పొందాలనుకునే వారికి ప్రస్తుతం క్లౌడ్ కిచెన్ బిజినెస్‌ ఒక ట్రెండీ అవకాశంగా మారుతోంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఇంట్లోనే వంట చేసి ఆన్‌లైన్ ద్వారా అమ్మే ఈ వ్యాపారం యువతలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. క్లౌడ్ కిచెన్ అంటే సాధారణ రెస్టారెంట్‌లా కూర్చొని తినే సదుపాయం ఉండదు. కేవలం ఆన్‌లైన్ ఆర్డర్ల కోసం మాత్రమే వంట చేసి ప్యాక్ చేసి పంపే విధానం. దీంతో పెద్ద రెస్టారెంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతో వ్యాపారం ప్రారంభించవచ్చు. సాధారణంగా రూ.20,000 నుంచి రూ.50,000 మధ్య పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఈ పెట్టుబడిలో ప్రధానంగా గ్యాస్ స్టౌ, వంట సామగ్రి, ప్యాకేజింగ్ మెటీరియల్, ఫుడ్ డెలివరీ యాప్‌లలో రిజిస్ట్రేషన్ ఖర్చులు ఉంటాయి. ఇంట్లోనే వంట చేయడం వల్ల అద్దె ఖర్చు లేకపోవడం ఈ వ్యాపారానికి పెద్ద ప్రయోజనం. ముఖ్యంగా బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, హోమ్ స్టైల్ కర్రీలు, హెల్తీ ఫుడ్ లేదా డైట్ ఫుడ్ వంటి ప్రత్యేక ఐటమ్స్‌పై దృష్టి పెడితే త్వరగా కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు విస్తరించడంతో నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా క్లౌడ్ కిచెన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. సరైన రుచితో పాటు మంచి ప్యాకేజింగ్, సమయానికి డెలివరీ ఉంటే కస్టమర్ల నమ్మకం పెరుగుతుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

అలాగే సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగిస్తే ఈ వ్యాపారాన్ని వేగంగా పెంచుకోవచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఫుడ్ ఫోటోలు, ఆఫర్లు ప్రచారం చేస్తే మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే ప్రారంభించగలిగే క్లౌడ్ కిచెన్ వ్యాపారం ప్రస్తుతం యువతకు మంచి అవకాశంగా మారుతోంది. సరైన ప్రణాళిక, మంచి రుచి, కస్టమర్ సర్వీస్ ఉంటే ఈ చిన్న వ్యాపారం త్వరగా లాభదాయకంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us