ముగిసిన న్యూస్9 ఇండియన్ టైగర్స్ ఫుట్‌బాల్ ట్రయల్స్.. 25 మందికి జర్మనీ వెళ్లే గోల్డెన్ ఛాన్స్!
న్యూస్9 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ నేషనల్ ఫుట్‌బాల్ ట్రయల్స్ చివరి రోజు దిబ్రూగఢ్‌లోని ఖనికర్ స్టేడియంలో ఉత్సాహంగా ముగిశాయి. ఇక చివరి రోజు ట్రయల్స్‌లో యువ ఫుట్‌బాల్ ప్లేయర్స్ సెలెక్టర్లను మెప్పించేందుకు తమ శక్తినంతా ధారపోసి, అత్యున్నత స్థాయి ఆటతీరును ప్రదర్శించారు.

న్యూస్9 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ నేషనల్ ఫుట్‌బాల్ ట్రయల్స్ చివరి రోజు దిబ్రూగఢ్‌లోని ఖనికర్ స్టేడియంలో ఉత్సాహంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో న్యూస్9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ జాతీయ ట్రయల్స్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. దీనిలో భాగంగా అస్సాంలోని డిబ్రూగఢ్ ఖానికర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ ట్రయల్స్‌లో యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించి సెలెక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
న్యూస్9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ నేషనల్ ఫుట్‌బాల్ ట్రయల్స్ లో.. మొదటి రెండు రోజులు టెక్నికల్ డ్రిల్స్, టాక్టికల్ అవగాహన, ఫిట్‌నెస్ పరీక్షలపై దృష్టి పెట్టగా… చివరి రోజు పూర్తిస్థాయిలో మ్యాచ్‌లు నిర్వహించారు. దీంతో కోచ్‌లు, సెలెక్టర్లు నిజమైన మ్యాచ్ పరిస్థితులను అంచనా వేయడంతోపాటు.. అద్భతమైన ఆటను ప్రదర్శించిన ఆటగాళ్లను గుర్తించారు.
అండర్-14, అండర్-17 విభాగాల్లోని అబ్బాయిలు, అమ్మాయిలు పోటీ మ్యాచ్‌ల్లో పాల్గొన్నారు. ఆటగాళ్ల గేమ్ ఇంటెలిజెన్స్, టీమ్‌వర్క్, నిర్ణయ సామర్థ్యం, ఒత్తిడిలో ప్రదర్శన వంటి అంశాలను పరీక్షించేలా మ్యాచ్‌లు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రతిభా వేటలో 38 వేల మందికి పైగా యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లు పాల్గొన్నారు. పలు దశల ఎంపికల అనంతరం సుమారు 300 మంది ఆటగాళ్లు డిబ్రూగఢ్‌లో జరిగిన మూడు రోజుల జాతీయ ట్రయల్స్‌కు ఎంపికయ్యారు.
ఇందులో నుంచి చివరికి కేవలం 25 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారు జర్మనీకి వెళ్లి అధునాతన ఫుట్‌బాల్ శిక్షణతో పాటు అంతర్జాతీయ అనుభవాన్ని పొందనున్నారు.
చివరి రోజు తల్లిదండ్రులు, కోచ్‌లు, సంరక్షకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై యువ ఆటగాళ్లను ప్రోత్సహించారు. గ్రాస్‌రూట్ స్థాయి ఫుట్‌బాల్ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
మూడు రోజుల ట్రయల్స్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి తుది ఎంపికలపై ఉంది. జాతీయ ట్రయల్స్‌లో అత్యుత్తమంగా ప్రదర్శించిన 25 మంది ఆటగాళ్లు జర్మనీ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక కానున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
