AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. ఛార్జీలు భారీగా పెంచిన ప్రభుత్వం.. ఎంతో తెలుసా..?

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి బ్యాడ్ న్యూస్. ఇక నుంచి రేషన్ కార్డు సేవలకు సర్వీస్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. రూ.200 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం దగ్గర నుంచి సభ్యుల తొలగింపు వరకు ప్రతీ సేవకు సంబంధించిన ఛార్జీలను పెంచారు.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. ఛార్జీలు భారీగా పెంచిన ప్రభుత్వం.. ఎంతో తెలుసా..?
Ration Card
Venkatrao Lella
|

Updated on: Mar 08, 2026 | 9:59 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్ ఉన్నవారికి బిగ్ షాక్ తగిలింది. కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైస్ కార్డ్ దరఖాస్తు సేవ రుసుం (సర్వీస్ ఛార్జ్)లను ప్రభుత్వం ఒకేసారి భారీగా పెంచింది. కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు సేవా రుసుంలను ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీంతో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవాలన్నా, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా సభ్యులను చేర్చాలన్నా, తొలగించాలన్నా సర్వీస్ ఛార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. రేషన్ కార్డుదారులకు ఇది అదనపు భారమనే చెప్పుకోవచ్చు.

కొత్త ఛార్జీలు ఇవే..

– గతంలో రూ. 24 సేవా రుసుం కలిగిన సేవలు రూ.100కు పెంచారు – గతంలో రూ.48 సేవా రుసుముగా గల రైస్ కార్డ్ విభజన సేవ రూ.200కు పెరిగింది – మీసేవ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల రైస్ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్నాయి -కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తుతో పాటు పాత కార్డు పొగోట్టుకున్న సందర్భంలో డూప్లికేట్ కార్డు పొందటం, రేషన్ కార్డుల్లోని వివరాలు తప్పుగా ఉంటే సవరించుకోవడం, కొత్త సభ్యులను చేర్చడం, ఉన్న సభ్యులను తొలగించడం, అడ్రస్ మార్పు, రైస్ కార్డును విభజించడం వంటి అన్ని సేవలకు సర్వీస్ ఛార్జీలకు అమలవుతాయి.

రేషన్ సేవల్లో సమూల మార్పులు

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ వ్యవస్థలో సమూలు మార్పులు శ్రీకారం చుట్టింది. క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త స్మార్ట్ కార్డులు రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రభుత్వం తొలగించగా.. వృద్దులకు మాత్రమే ప్రస్తుతం రేషన్ డీలర్లు ఇంటికి వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారు. మిగతావారు దుకాణాల వద్దకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో షాపుల ద్వారా బియ్యం, పంచదార మాత్రమే పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసేంది. కానీ ఇప్పుడు రాగులు, జొన్నలు, గోధుమ పిండి కూడా లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. గోధుమ పిండిని కిలో రూ.20కే అందిస్తున్నారు. ప్రస్తుతం కిలో రూ.70గా ఉండగా.. కేవలం రూ.20కే ప్రభుత్వం అందిస్తోంది. ఇక కందిపప్పును కూడా ప్రభుత్వం తక్కువ ధరకు గతంలో పంపిణీ చేయగా.. ప్రస్తుతం నిలిపివేసింది. భవిష్యత్తులో కందిపప్పు కూడా అందించే అవకాశముంది.

Follow Us
వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం..
వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం..
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
మండపంలో ప్రియుడు.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు.. చివరకు
మండపంలో ప్రియుడు.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు.. చివరకు
వామ్మో.. ఆ వర్కవుట్స్ ఏందీ మేడమ్.. నెటిజన్స్ రియాక్షన్ చూశారా..
వామ్మో.. ఆ వర్కవుట్స్ ఏందీ మేడమ్.. నెటిజన్స్ రియాక్షన్ చూశారా..
చూసి ఇదేం మూవీ అన్నారు.. ఇప్పటికీ యూత్ పెద్ద ప్యాన్స్..
చూసి ఇదేం మూవీ అన్నారు.. ఇప్పటికీ యూత్ పెద్ద ప్యాన్స్..
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..? ప్రధాని మోదీ అలర్ట్ వెనుక ఆంతర్యం ఇదేనా
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..? ప్రధాని మోదీ అలర్ట్ వెనుక ఆంతర్యం ఇదేనా
మరోసారి కుప్పకూలిన మార్కెట్‌.. కారణం?
మరోసారి కుప్పకూలిన మార్కెట్‌.. కారణం?
శభాష్ పూజిత.. లండన్ గడ్డపై కౌన్సిలర్‌‌గా గెలిచిన ఓరుగల్లు బిడ్డ..
శభాష్ పూజిత.. లండన్ గడ్డపై కౌన్సిలర్‌‌గా గెలిచిన ఓరుగల్లు బిడ్డ..
గజలక్ష్మీ–రుచక యోగం కలయికతో అసాధారణ రాజయోగం! ఈ రాశులకు గోల్డెన్ ట
గజలక్ష్మీ–రుచక యోగం కలయికతో అసాధారణ రాజయోగం! ఈ రాశులకు గోల్డెన్ ట
పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు కారణాలు
పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు కారణాలు