AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండపంలో మరో అమ్మాయితో ప్రియుడు.. ప్రియురాలు చేసిన పనికి దిమ్మతిరిగిపోయింది..

12 ఏళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని.. చివరకు మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు మహిళా సంఘాల నేతలతో కలిసి నేరుగా పెళ్లి మండపానికి చేరుకుని వివాహాన్ని అడ్డుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. యువతి చూపించిన ఫోటోలు, ఆధారాలతో పెళ్లికూతురు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మండపంలో మరో అమ్మాయితో ప్రియుడు.. ప్రియురాలు చేసిన పనికి దిమ్మతిరిగిపోయింది..
Wedding (representative image)
G Sampath Kumar
| Edited By: |

Updated on: May 11, 2026 | 11:02 AM

Share

ప్రేమిస్తున్నానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. అతను చెప్పిన మాటలు నమ్మిన ఆమె.. అతనికి దగ్గరైంది..కానీ, అప్పుడే మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. పెళ్లంటూ నమ్మించి.. వేరే అమ్మాయితో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు.. దీంతో కంగుతిన్న ఆమె.. సరిగ్గా పెల్లి సమయానికి ఎంట్రీ ఇచ్చింది.. తనని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని మోసం చేసి మరో అమ్మాయితో వివాహం చేసుకోవడానికి సిద్ధం ‌కాగా.. ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు ఘటన కరీంనగర్‌లో చోటుసుకుంది.

వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామానికి చెందిన నరేశ్ చొప్పదండి పోలీసు స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హనుమకొండకి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది.. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. 12 ఏండ్లుగా నరేష్ ఆ యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. తనని కాదని మరో అమ్మాయితో చొప్పదండిలో ఓ పంక్షన్ హాల్ లో వివాహం చేసుకొవడానికి నరేష్ సిద్ధం అవ్వగా.. ఈ విషయం ప్రియురాలికి తెలిసింది. దీంతో ఆ యువతి మహిళ సంఘాల నేతలతో కలిసి పంక్షన్ హాల్ కి వెళ్లి తన దగ్గర ఉన్న ఫోటోలు చూపించి వివాహం నిలిపివెయ్యాలని కోరింది.

వరుడు కుటుంబ సభ్యులు యువతిని అక్కడి నుండి గుట్టుచప్పుడు కాకుండా పంపించాలని ప్రయత్నించగా.. ఈ విషయం కాస్తా పెళ్లికూతురు వారికి తెలవడంతో వివాహం రద్దు చేసుకుని.. నరేష్ పై చొప్పదండి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు. నరేష్ విషయం తెలుసుకుని వధువు అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తను మోసం చేసిన ప్రియుడుతోనే పెళ్లి జరపాలని ప్రియురాలు పోలీసులను కోరుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
మండపంలో ప్రియుడు.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు.. చివరకు
మండపంలో ప్రియుడు.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు.. చివరకు
వామ్మో.. ఆ వర్కవుట్స్ ఏందీ మేడమ్.. నెటిజన్స్ రియాక్షన్ చూశారా..
వామ్మో.. ఆ వర్కవుట్స్ ఏందీ మేడమ్.. నెటిజన్స్ రియాక్షన్ చూశారా..
చూసి ఇదేం మూవీ అన్నారు.. ఇప్పటికీ యూత్ పెద్ద ప్యాన్స్..
చూసి ఇదేం మూవీ అన్నారు.. ఇప్పటికీ యూత్ పెద్ద ప్యాన్స్..
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..? ప్రధాని మోదీ అలర్ట్ వెనుక ఆంతర్యం ఇదేనా
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..? ప్రధాని మోదీ అలర్ట్ వెనుక ఆంతర్యం ఇదేనా
మరోసారి కుప్పకూలిన మార్కెట్‌.. కారణం?
మరోసారి కుప్పకూలిన మార్కెట్‌.. కారణం?
శభాష్ పూజిత.. లండన్ గడ్డపై కౌన్సిలర్‌‌గా గెలిచిన ఓరుగల్లు బిడ్డ..
శభాష్ పూజిత.. లండన్ గడ్డపై కౌన్సిలర్‌‌గా గెలిచిన ఓరుగల్లు బిడ్డ..
గజలక్ష్మీ–రుచక యోగం కలయికతో అసాధారణ రాజయోగం! ఈ రాశులకు గోల్డెన్ ట
గజలక్ష్మీ–రుచక యోగం కలయికతో అసాధారణ రాజయోగం! ఈ రాశులకు గోల్డెన్ ట
పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు కారణాలు
పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు కారణాలు
అనుమానం భూతానికి బలైపోయిన పసిప్రాణం.. పాపం..
అనుమానం భూతానికి బలైపోయిన పసిప్రాణం.. పాపం..