AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాల్ మార్క్ లేకుండానే బంగారం విక్రయాలు.. జ్యూవెలరీ వ్యాపారులకు వణుకు పుట్టిస్తున్న BIS..

హాల్‌మార్క్ నిబంధనలు పాటించని బంగారు వ్యాపారులపై భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) ఉక్కుపాదం మోపుతోంది. తెలంగాణలోని 13 జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌లోనే సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

హాల్ మార్క్ లేకుండానే బంగారం విక్రయాలు.. జ్యూవెలరీ వ్యాపారులకు వణుకు పుట్టిస్తున్న BIS..
Gold Hallmark
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 22, 2026 | 9:06 AM

Share

జ్యూవెలరీ వ్యాపారులకు BIS దాడులు వణుకు పుట్టిస్తున్నాయి.. హాల్‌మార్క్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై కొరడా విధించడంతోపాటు.. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం తెలంగాణలో కలకలం రేపింది. భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) హాల్ మార్క్ నిబంధనలను పాటించని బంగారు వ్యాపారులపై చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాతరపెట్టి కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న బంగారు షాపులపై దాడులు నిర్వహించి భారీమొత్తంలో హాల్ మార్క్ లేని బంగారు ఆభరణాలు సీజ్ చేశారు.. తెలంగాణలోని 13 జిల్లాల్లో సోదాలు జరిగాయి. కేవలం ఒక్క వరంగల్ లోనే సుమారు 10 కోట్ల రూపాయల విలువగల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు.

బిఐఎస్ హైదరాబాద్ శాఖ డైరెక్టర్ పి.వి శ్రీకాంత్ ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్లు, బిఐఎస్ బృందం హాల్ మార్క్ నిబంధనలను పాటించని బంగారు దుకాణాలపై దాడులు నిర్వహించారు.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బంగారు షాప్ లపై దాడులు జరిగినట్లుగా సమాచారం.. వరంగల్ తోపాటు హనుమకొండ నగరాల్లోనూ పలు బంగారు దుకాణాల్లో బిఐఎస్ బృందం దాడులు నిర్వహించింది. హాల్ మార్క్ నిబంధనలేని నెక్లెస్ సెట్లు, ఉంగరాలు, గొలుసులు, చెవి దిద్దులు, బంగారు గాజులు భారీ ఎత్తున సీజ్ చేశారు.7.875 గ్రాముల విలువగల బంగారం స్వాధీనం చేసుకున్నారు.. వీటి విలువ సుమారు 10 కోట్లు ఉంటుందని అంచనా..

Bis Raids On Jewellery Shop

Bis Raids On Jewellery Shop

బంగారు ఆభరణాల విక్రయాలలో నాణ్యత, పారదర్శకత కోసం తనిఖీలు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు..ఆభరణాలపై కచ్చితంగా BIS లోగో తోపాటు ఆరు అంకెల HUID ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. హాల్ మార్క్ దుర్వినియోగం లేదా హెచ్ యు ఐ డి లేని బంగారు ఆభరణాలు విక్రయం ఎక్కడైనా జరిగితే బిఐఎస్ కేర్ మొబైల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.. BIS లోయూ సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.bis.gov.in లేదా e-BIS వెబ్ సైట్లను సందర్శించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us