AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పోషకాల నిధి ఈ వెజ్ సూప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి

ఈనాటి బిజీ జీవనశైలిలో బరువు తగ్గడం మరియు బిపి, షుగర్, థైరాయిడ్, పీసీఓడీ వంటి ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవడం చాలామందికి పెద్ద సవాలుగా మారింది. రాత్రి వేళల్లో అన్నం లేదా డిన్నర్ బదులుగా పోషకాలు మెండుగా ఉన్న ఆరోగ్యకరమైన సూప్‌లు తాగడం వల్ల త్వరితగతిన బరువు తగ్గవచ్చు.

Phani CH
|

Updated on: Aug 10, 2026 | 6:51 PM

Share
 పర్‌ఫెక్ట్ వెయిట్ లాస్ అండ్ హెల్తీ రెసిపీయే 'జొన్న గుమ్మడికాయ సూప్'. జొన్నపిండిలోని పీచు పదార్థం, గుమ్మడికాయలోని విటమిన్లు మరియు జీర్ణానికి దోహదపడే తాలింపు ఈ సూప్‌కు అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

1 / 5
ఈ జొన్న గుమ్మడికాయ సూప్ తయారీకి ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల జొన్నపిండిని వేసి సన్నటి మంటపై కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. జొన్నపిండికి బదులుగా రాగి పిండి లేదా ఇతర చిరుధాన్యాల పిండిని కూడా వాడుకోవచ్చు.

2 / 5
వేరొక పాత్రలో 750-800 ml నీళ్లు మరిగించి, అందులో 350 గ్రాముల తీపి గుమ్మడికాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి 15 నిమిషాలు మెత్తగా ఉడికించాలి. గుమ్మడికాయ ఉడికిన తర్వాత అర కప్పు పుదీనా ఆకులు వేసి మరో 3 నిమిషాలు ఉడికించి నీటిని వడకట్టి పక్కన ఉంచాలి.

3 / 5
చల్లారిన గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ, పుదీనా మరియు వేయించిన జొన్నపిండిని మిక్సీ జార్‌లో వేసి, ఉడికించిన నీటిని పోస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో వడకట్టిన గుమ్మడికాయ నీళ్లను పోసి, అందులో రుబ్బిన జొన్న-గుమ్మడి పేస్ట్‌ను కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. సూప్ చిక్కబడే వరకు 3-4 నిమిషాలు ఉడికించి, తగినంత సైంధవ లవణం (హిమాలయన్ సాల్ట్), ఒకటిన్నర టీస్పూన్ల దంచిన మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

4 / 5
వేరొక చిన్న పాన్‌లో ఒకటిన్నర టీస్పూన్ల నెయ్యి వేడిచేసి, అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ వాము, 4 సన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు వేసి దోరగా వేయించి సూప్‌లో కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు, ఒక నిమ్మకాయ రసం పిండి వేడివేడిగా తాగుతుంటే కడుపు నిండటంతో పాటు అమృతతుల్యమైన రుచి లభిస్తుంది

5 / 5
Follow Us