AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంద కోట్ల హీరోలు.. కానీ ఇంకా టైర్-1 కాదు! ఈ సినిమాలే వారి కెరీర్‌ను మార్చేస్తాయా?

వంద కోట్ల హీరోలు.. కానీ ఇంకా టైర్-1 కాదు! ఈ సినిమాలే వారి కెరీర్‌ను మార్చేస్తాయా?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 7:24 PM

Share

వంద కోట్ల విజయాలు అందుకున్నా నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య ఇంకా టాలీవుడ్ టాప్ లీగ్‌లో పూర్తిగా స్థిరపడలేకపోయారు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’, ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’, ‘వృషకర్మ’ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో తమ మార్కెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాల ఫలితమే వారి స్టార్‌డమ్‌కు అసలైన పరీక్షగా మారనుంది.

సినిమా హిట్టయినా… వంద కోట్ల కలెక్షన్లు వచ్చినా… ఇంకా మీడియం రేంజ్ స్టార్స్‌గానే మిగిలిపోతున్నారు కొందరు యంగ్ హీరోలు. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నా టైర్-1 రేంజ్‌కి మాత్రం వెళ్లలేకపోతున్నారు. ఇంతకీ నెక్ట్స్ రాబోతున్న భారీ సినిమాలతో వాళ్లు ఆ లైన్ దాటుతారా,.. ప్రమోషన్ కొడతారా? ఈ క్రేజీ డిస్కషన్‌కు సంబంధించి ఫుల్ డిటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం. ప్రజెంట్ టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోల టార్గెట్ అంతా వంద కోట్లు దాటి పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదగడం పైనే ఉంది. ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉన్నారు న్యాచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, యువ సామ్రాట్‌ నాగచైతన్య. ఇప్పటికే వంద కోట్ల వసూళ్లతో తమ మార్కెట్ స్టామినా ప్రూవ్ చేసిన ఈ హీరోలకు… ఇంకా బిగ్ బడ్జెట్ స్టార్స్ ఇమేజ్ రాలేదు. దసరా, సరిపోదా శనివారం, హిట్‌ 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సెంచరీ కొట్టేసి తన మార్కెట్‌ను అమాంతం పెంచుకున్నారు నాని. కానీ టైర్-1 బరిలో నిలవాలంటే మరో భారీ హిట్ పడాలి. అందుకే ప్రజెంట్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ది ప్యారడైజ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ యాక్షన్ డ్రామా నానికి ఖచ్చితంగా ప్రమోషన్ ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అటు విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గీత గోవిందంతో అప్పట్లోనే వంద కోట్లు అందుకున్న రౌడీ బాయ్… ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్‌తో ‘రణబాలి’, రవికిరణ్ కోలాతో ‘రౌడీ జనార్ధన’ లాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్‌ లైన్‌లో పెట్టిన రౌడీ భాయ్‌, ఆ సినిమాలతో టాప్‌ లీగ్‌లోకి అడుగుపెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరోవైపు నాగచైతన్య కూడా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కోసం చూస్తున్నారు. ఆల్రెడీ తండేల్‌తో వందకోట్ల హిట్ అందుకున్న చైతూ , వృషకర్మతో మరో భారీ సక్సెస్‌ను టార్గెట్ చేశారు. చైతూ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే… బిగ్ బడ్జెట్ స్టార్స్ సరసన ప్లేస్ దక్కడం ఖాయం. మరి ఈ హీరోలు తమ నెక్ట్స్ మూవీస్‌తో మీడియం రేంజ్ అనే ట్యాగ్‌ను చెరిపేసి, బిగ్ లీగ్‌లో అడుగుపెడతారేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? రష్మిక, కియారా, రుక్మిణి మధ్య హాట్ రేస్!

టాలీవుడ్‌లో కాంటెంపరరీ కథలకు బ్రేక్.. స్టార్ హీరోలందరూ పీరియాడిక్, ఫ్యూచరిస్టిక్ బాటే ఎందుకు?

షూటింగ్‌లతో ఫుల్ బిజీ టాలీవుడ్.. స్టార్ హీరోలందరూ సెట్స్‌పైనే

Anupama Parameswaran: ‘నా గొంతు నేనే వినిపిస్తా’.. అనుపమ ఎమోషనల్ పోస్ట్ వెనక అసలు కథ ఏంటి?

Mamitha Baiju: నెల రోజుల్లో మూడు భారీ సినిమాలు.. మమిత బైజు దండయాత్రకు రెడీ!

Follow Us