బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, శస్త్రచికిత్స చేయించుకుని, ఐసీయూలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారనే విషయం ఆయన బ్లాగ్ పోస్ట్ ద్వారానే వెల్లడైంది. శస్త్రచికిత్స అనంతరం కోలుకునే ప్రక్రియ చాలా కష్టమని ఆయన వివరించారు. ఈ వార్తతో ఆయన అభిమానులు ఆశ్చర్యానికి లోనై, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.