కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు తొమ్మిది అరుదైన కచిడీ చేపలు చిక్కాయి. అంతర్వేది మినీ హార్బర్లో వీటిని లక్ష రూపాయలకు వేలం వేశారు. మగ కచిడీ చేపల పొట్ట భాగాలను వైద్య రంగంలో ఔషధాల తయారీకి వాడతారు. ఈసారి ఎక్కువ ఆడ చేపలు దొరికినా, లక్ష రూపాయలు రావడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.