AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Vs PPF Vs VPF: ఈ మూడింటిలో ఏది బెటర్..? ఎందులో పెట్టుబడి పెడితే మంచిదంటే..?

కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. అందులో పీఎఫ్, వీపీఎఫ్, పీపీఎఫ్ అనేవి బాగా పాపులర్ అయ్యాయి. పీఎఫ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు పీఎఫ్ సౌకర్యం అనేది కేంద్రం కల్పిస్తోంది. ఇక వీఎఫ్, పీపీఎఫ్ గురించి తెలుసుకుందాం.

EPF Vs PPF Vs VPF: ఈ మూడింటిలో ఏది బెటర్..? ఎందులో పెట్టుబడి పెడితే మంచిదంటే..?
Investments
Venkatrao Lella
|

Updated on: Jul 22, 2026 | 8:55 AM

Share

ఈ రోజుల్లో ఖర్చులు అనేవి పెరిగాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది. ఇలాంటి తరుణంలో భవిష్యత్ అవసరాల కోసం చాలామంది డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. మీ డబ్బులు సురక్షితంగా పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. అందులో కేంద్రం ప్రభుత్వ పొదుపు పథకాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే అనేక పథకాలు అందుబాటులో ఉండటం వల్ల ఏది ఏంచుకోవాలనేది పెట్టుబడిదారులకు కన్‌ప్యూజ్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేవి బాగా పాపులర్ అయ్యాయి. ఈ మూడు పథకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిల్లో ఏది మంచిది? అనేది ఇప్పుడు చూద్దాం.

EPF (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్)

ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. సాధారణంగా 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ఈపీఎఫ్ఓ పరిధిలోకి వస్తాయి. ప్రతి నెలా ఉద్యోగి బేసిక్ శాలరీ నుంచి 12 శాతం కట్ చేస్తారు. యజమాని కూడా అంతే మొత్తంలో నిధిని జోడించి పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు. దీని ద్వారా ఉద్యోగులు తమ కొంతమేర డబ్బును భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకోవచ్చు. రూ.15 వేలపైన జీతం ఉన్నవారు ఇందులో స్వచ్చంధంగా చేరవచ్చు.

VPF (స్వచ్ఛంద భవిష్య నిధి)

VPF అనేది EPFకు ఒక పొడిగింపు పథకం. మీరు ఎక్కువ పొదుపు చేసుకోవాలంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో చేరవచ్చు. EPF మాదిరిగానే ఇందులో వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే రూ.15 వేల కంటే తక్కువ జీతం ఉన్నవారు తప్పనిసరిగా పీఎఫ్ పరిధిలో చేరారు. కానీ వీవీఎఫ్‌లో ఉద్యోగుల స్వచ్చంధంగా చేరవచ్చు.

PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)

ఇది దేశంలో అత్యంత పాపులర్ అయిన స్మాల్ సేవింగ్స్ స్కీమ్. దేశంలోని ఏ పౌరుడైనా ఇందులో అకౌంట్ తెరవొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 15 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ దీనికి ఉంటుంది. ఆ తర్వాత వడ్డీతో సహా మీరు మొత్తం తీసుకోవచ్చు. మధ్యలో అవసరమైన లోన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

ఈ మూడింటిలో ఏది మంచిది..?

ఈ మూడు పథకాలు అర్హత, వాటా పరిమితులు, ఉపసంహరణ నియమాలు, పెట్టుబడి కాలవ్యవధి పరంగా విభిన్నంగా ఉంటాయి. ఈ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం ద్వారా మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా సరైనది ఎంచుకోవాలి. పీఎఫ్ ద్వారా పెన్షన్, జీవిత బీమా లాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈపీఎఫ్‌లో కొనసాగుతూనే.. పెద్ద మొత్తంలో పదవీ విరమణ నిధిని నిర్మించుకోవాలనుకుంటే VPFలో చేరవచ్చు. ఇందులో మీరు స్వచ్చంధంగా ఎంతైనా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక 15 ఏళ్ల తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పొందాలనుకుంటే పీపీఎఫ్ అనేది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

Follow Us