July 18, 2026
Subhash
భారతీయ రైళ్లలో జనరల్ బోగీలను (అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు) ఎల్లప్పుడూ రైలుకు ముందు భాగంలో (ఇంజిన్ పక్కన), అలాగే వెనుక భాగంలో (చివర్లో) మాత్రమే ఏర్పాటు చేస్తారు.
జనరల్ బోగీలలో రద్దీ ఎక్కువ. స్లీపర్, ఏసీ బోగీల కంటే జనరల్ బోగీలు చాలా ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. ఇంత బరువున్న బోగీలను రైలు మధ్యలో పెడితే బ్యాలెన్స్ దెబ్బతింటుంది.
రైలు వేగంగా వెళ్లేటప్పుడు లేదా మలుపులు తిరిగేటప్పుడు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. అందుకే, బరువు సమానంగా పంపిణీ అవ్వడానికి వీటిని రెండు చివర్లలో ఏర్పాటు చేస్తారు.
జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఒకవేళ ఈ బోగీలను రైలు మధ్యలో ఉంచితే, స్టేషన్ రాగానే ప్రయాణికులందరూ ఫ్లాట్‌ఫారమ్ మధ్య భాగంలోనే గుమిగూడుతారు. దీంతో తొక్కిసలాట ప్రమాదాలు జరగవచ్చు.
అలాగే ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణికులు రైలు ఎక్కడానికి లేదా దిగడానికి తీవ్ర ఇబ్బందులు పడతారు. జనరల్ బోగీలు చివర్లలో ఉండటం వల్ల రద్దీ రెండు వైపులా విడిపోతుంది.
జనరల్ బోగీలలో ప్రయాణించేవారు ఎక్కువ శాతం తక్కువ దూరాలు ప్రయాణించే లోకల్ ప్యాసింజర్లు ఉంటారు. వారు ప్రతి చిన్న స్టేషన్‌లోనూ ఎక్కడం, దిగడం చేస్తుంటారు.
ఈ బోగీలు రెండు చివర్లలో ఉండటం వల్ల వారు ఇతర ప్రయాణికులకు అంతరాయం కలిగించకుండా వేగంగా రైలు ఎక్కడానికి, దిగడానికి వీలవుతుంది.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి రోజులో 24 గంటలూ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి వీటిని సంరక్షించుకోవడం మన బాధ్యత.