భారతదేశంలో అత్యంత 'మురికి' రైల్వే స్టేషన్ ఇదే..

Venkatrao Lella

Images: Pinterest

16 July 2026

పెరుంగలత్తూరు (తమిళనాడు): ఈ రైల్వే స్టేషన్ దక్షిణ రైల్వే జోన్‌లోని చెన్నై రైల్వే డివిజన్‌లో ఉంది. ఇండియన్ రైల్వేస్ రైల్ స్వచ్ఛ పోర్టల్ ప్రకారం ఇది భారతదేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్.

గిండి (తమిళనాడు): క్యూసీఐ నివేదిక ప్రకారం చెన్నై బీచ్-చెంగల్పట్టు మార్గంలో ఉన్న ఈ చిన్న రైల్వే స్టేషన్ భారతదేశంలో రెండవ అత్యంత మురికి రైల్వే స్టేషన్.

హగంజ్ (యూపీ): షాహగంజ్ జంక్షన్ అత్యంత మురికి రైల్వే స్టేషన్లలో ఒకటి. యూపీలోని మధుర, కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లు కూడా అత్యంత మురికి స్టేషన్ల జాబితాలో ఉన్నాయి

సదర్ బజార్ (ఢిల్లీ): ఈ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత మురికిగా ఉండే స్టేషన్లలో ఒకటి. సరిగా లేని మురుగునీటి పారుదల వ్యవస్థ, చెత్తాచెదారం దీనిని అత్యంత మురికి స్టేషన్లలో ఒకటిగా మార్చాయి

ఒట్టపాలెం (కేరళ): కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న ఒట్టపాలెం స్టేషన్‌లో 2021లో ఆధునీకరణ పనులు చేపట్టారు. అయినా భారతదేశంలోని అత్యంత మురికి స్టేషన్లలో ఒకటిగా మిగిలిపోయింది.

దేశంలోని అత్యంత మురికి స్టేషన్లలో తమిళనాడుకు చెందిన పాట్నా, ముజఫర్‌పూర్, అరేరియా కోర్ట్ రైల్వే స్టేషన్, ఝాన్సీ, బరేలీ రైల్వే స్టేషన్, వేలచ్చేరి, గూడువంచేరి రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి.

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఈ సర్వే కోసం 12 లక్షల మంది ప్రయాణికుల అభిప్రాయాలను ఉపయోగించారు.

QCI నివేదిక ప్రకారం 75 రైల్వే స్టేషన్లు A1 కేటగిరీలో ఉన్నాయి.. ఇవి వార్షిక ప్రయాణీకుల ఆదాయంగా రూ. 75 కోట్లకు పైగా ఆర్జిస్తున్నాయి.