బ్యాంకు ఖాతాదారులకు RBI హెచ్చరిక..ఈ పని చేయకుంటే మీ అకౌంట్‌ నిలిపివేత

July 20, 2026

Subhash

బ్యాంకు ఖాతాదారులు తమ వ్యక్తిగత గుర్తింపు, చిరునామా వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చెబుతోంది. 

RBI కీలక ఆదేశాలు

తమ బ్యాంకు ఖాతాలకు కేవైసీ చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించినట్లయితే నవీకరించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

కేవైసీ

ఖాతాదారుల భద్రత, ఆర్థిక నేరాల నియంత్రణలో భాగంగా ‘నో యువర్ కస్టమర్’ ప్రక్రియను బ్యాంకులు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించింది. కేవైసీ లేకుంటే లావాదేవీలను నిలిపివేయనున్నట్లు ఆర్బీఐ చెబుతోంది.

భద్రత

లావాదేవీల తీవ్రత ఆధారంగా ఖాతాలను మూడు రకాలుగా విభజించేలా బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. గడువులోగా కేవైసీ చేసుకోవడం మంచిది.

 కేవైసీ గడువు

తరచూ రూ. 50 వేలకు మించి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తున్నట్లయితే ‘హైరిస్క్’ ఖాతాదారులు ప్రతి రెండేళ్లకొకసారి కేవైసీ సమర్పించాల్సి ఉంటుంది. 

రూ. 50 వేలకు మించి

మీడియం రిస్క్ ఖాతాదారులు ప్రతి 8 ఏళ్లకోసారి, తక్కువ లావాదేవీలు జరిగే ‘లోరిస్క్’ ఖాతాదారులు ప్రతి 10 సంవత్సరాలకోసారి రీ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని ఆర్బీఐ స్పష్టం చేసింది.

మీడియం రిస్క్ 

తెలంగాణలో గత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి దాదాపు 24,59,248 బ్యాంకు ఖాతాల్లో కేవైసీ వివరాలు పెండింగ్‌లో ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. 

పెండింగ్ ఖాతాలు

ఇందులో సుమారు 2.88 లక్షల ఖాతాల్లో అసలు ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని తేలింది. ఒక ప్రధాన బ్యాంకులోనే ఏకంగా 9.90 లక్షల ఖాతాలు రీ-కేవైసీ కోసం వేచి ఉన్నాయి.

లావాదేవీలు

 కేవైసీ చేసుకునేందుకు విధించిన గడువులోగా తాజా వివరాలు అప్‌డేట్‌ చేసుకోకపోతే ఆయా బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తామని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.

 కేవైసీ