చిత్తూరు జిల్లాలోని 800 ఏళ్ల నాటి మృత్యుంజయ శివాలయంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. ఇటీవల పునర్నిర్మాణం జరుపుకున్న ఈ ప్రాచీన ఆలయంలో, గత పది రోజులుగా జరుగుతున్న రుద్రపఠనం సందర్భంగా స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తుంటే, ఆ నూనె పాలుగా మారిపోతోంది. ఈ దివ్య వైనాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.