AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ అందమేంటండీ బాబూ.. 52 ఏళ్ల వయసులో గ్లామర్ సంచలనం.. నెట్టింట హీటెక్కిస్తున్న సీనియర్ హీరోయిన్..

ఒకప్పుడు సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో ఆమె గ్లామర్ సెన్సేషన్. ఒకటి రెండు చిత్రాలతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఊహించని మలుపులతో ఆమె కెరీర్ అనుకున్నంత స్థాయిలో సాగలేదు. స్టార్ హీరోయిన్ కావాల్సిన ఆమె.. అనుకోకుండా తెలుగు సినిమాలకు దూరమైంది. ఇప్పుడు 52 ఏళ్ల వయసులో గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది.

Tollywood: ఆ అందమేంటండీ బాబూ.. 52 ఏళ్ల వయసులో గ్లామర్ సంచలనం.. నెట్టింట హీటెక్కిస్తున్న సీనియర్ హీరోయిన్..
Urmila
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2026 | 8:50 AM

Share

ఒకప్పుడు హిందీతో పాటు తెలుగు సినీ పరిశ్రమను తన గ్లామర్, అభినయంతో ఏలిన సీనియర్ కథానాయిక ఊర్మిళ మటోండ్కర్. ప్రస్తుతం ఆమె వయసు 52 ఏళ్లు అంటే ఎవరూ సులువుగా నమ్మలేకపోతున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న గ్లామరస్ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఆమె రూపం, ఫిట్‌నెస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఆమె అసలు ఏమైనా అందం తింటుందా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. హిందీలో ‘రంగీలా’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఊర్మిళ, ఆ తర్వాత వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 90ల కాలంలో తనదైన స్టైల్, డ్యాన్స్, నటనతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.

తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఊర్మిళ చాలా సుపరిచితురాలు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అనేక హిట్ చిత్రాల్లో ఆమె కథానాయికగా అలరించారు. అంతం, గాయం, మనీ మనీ, అనగనగా ఒక రోజు, భారతీయుడు (కమల్ హాసన్ కాంబినేషన్) వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. వయసు 50 ఏళ్లు దాటినా కూడా తన ఫిట్‌నెస్‌ను, గ్లోను అలాగే కాపాడుకోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల యువతులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె గ్లామర్ షోతో కుర్రకారును ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి.

90ల కాలంలో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనదైన గ్లామర్, నటనతో ఊర్మిళ మటోండ్కర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శైలి సినిమాల్లో ఆమె పాత్రలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

ఉర్మిళా మండోట్కర్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

Follow Us