AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagyasree Borse: ‘ఐరెన్ లెగ్’ అంటూ నన్నే ఎందుకు..? హిట్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే ఘాటు కౌంటర్!

Bhagyasree Borse: ‘ఐరెన్ లెగ్’ అంటూ నన్నే ఎందుకు..? హిట్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే ఘాటు కౌంటర్!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 6:33 PM

Share

‘లెనిన్’ విజయంతో తొలి హిట్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే, తనపై వచ్చిన ‘ఐరెన్ లెగ్’ ముద్రపై తొలిసారి స్పందించారు. సినిమా ఫలితానికి హీరోయిన్‌ను మాత్రమే బాధ్యురాలిగా చూడటం సరైన విధానం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ప్రతి పాత్రకు పూర్తి న్యాయం చేశానని, ఫలితం ఒక్కరి చేతుల్లో ఉండదని స్పష్టం చేస్తూ స్క్రిప్ట్ ఎంపికలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటానన్నారు.

వరసగా రెండు సినిమాలు ఫ్లాపైతే ఆ హీరోయిన్‌కు ఇండస్ట్రీలో ఇచ్చే ముద్దుపేరేంటో తెలుసా.. ఐరెన్ లెగ్. మన దగ్గర కూడా చాలా మందికి ఈ బిరుదు వచ్చింది. తాజాగా ఈ ఐరెన్ లెగ్ కాంట్రవర్సీపై ఓపెన్ అయ్యారు భాగ్యశ్రీ బోర్సే. లెనిన్ తర్వాత ఈమె తీరు, జోరు మారింది. కెరీర్‌లో తొలి సక్సెస్ చూసాక.. ఐరెన్ లెగ్ ముద్రపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారీమే. మరింతకీ బోర్సే ఏమంది..? హిట్ ఇచ్చిన జోష్ ఇంకేదీ ఇవ్వదు.. భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం అలాంటి జోష్ మీదే ఉన్నారు. కెరీర్ మొదలుపెట్టి మూడేళ్ళవుతున్నా ఒక్క హిట్ కూడా కొట్టకపోవడంతో భాగ్యశ్రీ బోర్సేను ఐరెన్ లెగ్ అని పిలవడం మొదలెట్టారు.. ఈ టైమ్‌లోనే లెనిన్ సినిమాతో హిట్ అకౌంట్ ఓపెన్ చేసారు ఈ బ్యూటీ. ఇదే సమయంలో తన గత సినిమాల ఫలితాలపై ఓపెన్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫెయిల్యూర్స్ గురించి మాత్రమే కాదు.. ఐరెన్ లెగ్ ముద్ర గురించి కూడా ఓపెన్ అయ్యారు భాగ్యశ్రీ. సనిమా ఫలితానికి హీరోయిన్‌ను మాత్రమే బాధ్యులను చేయడంపై ఘాటుగా స్పందించారు ఈ బ్యూటీ. స్క్రిప్ట్ తానే సెలెక్ట్ చేసినా కూడా చాలా మంది కలిసి పని చేసినపుడు ఫెయిల్యూర్‌కు హీరోయిన్‌నే ఎందుకు బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. తనకిచ్చిన పాత్రకి 100 పర్సెంట్ న్యాయం చేసానా లేదా అనేది ముఖ్యమని.. తనవరకు ప్రతీ సినిమాలో అది చేసానన్నారు భాగ్యశ్రీ. రిజల్ట్ తన చేతుల్లో లేదని.. కానీ ఫ్లాప్ వస్తే హీరోయిన్‌నే బ్లేమ్ చేయడం ఎక్కడి న్యాయమని గట్టిగానే నిలదీసారు ఈ బ్యూటీ. గతంలోనూ కొందరు హీరోయిన్లకు ఇది తప్పలేదన్నారు.. ఇకపై స్క్రిప్ట్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటానని చెప్పారు భాగ్యశ్రీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salman Khan: కండల వీరుడికి ఏమైంది..? సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూసి షాక్‌లో అభిమానులు!

భారీ సినిమాల దర్శకుల కొత్త మిషన్.. చిన్న సినిమాలకు పాన్ వరల్డ్ సపోర్ట్!

God Of War: డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’.. తారక్ కోసం గురూజీ మైథాలజీ మ్యాజిక్!

జెన్ జీకి హాలీవుడ్ ఫీవర్.. తెలుగు సినిమాలు ఎందుకు కనెక్ట్ కావడం లేదు?

మెగాఫోన్ పట్టిన మాస్ హీరోలు.. డైరెక్షన్‌లోనూ కమర్షియల్ ఫార్ములాపైనే నమ్మకం!

Follow Us