AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ సినిమాల దర్శకుల కొత్త మిషన్.. చిన్న సినిమాలకు పాన్ వరల్డ్ సపోర్ట్!

భారీ సినిమాల దర్శకుల కొత్త మిషన్.. చిన్న సినిమాలకు పాన్ వరల్డ్ సపోర్ట్!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 6:18 PM

Share

పాన్ వరల్డ్ స్థాయిలో భారీ సినిమాలు తెరకెక్కిస్తున్న రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ వంటి దర్శకులు ఇప్పుడు చిన్న సినిమాలకు అండగా నిలుస్తున్నారు. తమ బ్రాండ్ విలువను కొత్త దర్శకులు, వినూత్న కథల కోసం ఉపయోగిస్తూ నిర్మాణంలో భాగమవుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఆధారిత చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తూ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు.

వాళ్లందరూ ప్యాన్ ఇండియా కాదు కాదు.. ప్యాన్ వరల్డ్ డైరెక్టర్స్. వాళ్ల సినిమాల్లో ఓ పాటకు, ఫైట్‌కే పదుల కోట్లు ఖర్చు పెడుతుంటారు.. అలాంటి వాళ్లు తలుచుకుంటే పెద్ద సినిమాలనే నిర్మించొచ్చు. కానీ మన దర్శకుల దారే వేరు. ఎవ్వరూ ఊహించని రీతిలో చిన్న సినిమాలను బ్యాక్ చేస్తున్నారు మన ప్యాన్ వరల్డ్ డైరెక్టర్స్. మరి వాళ్లెవరు.. ఆ సినిమాలేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? వందల, వేల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్న దర్శకుల ఆలోచనలు కూడా అదే రేంజ్‌లోనే ఉంటాయి. కానీ మన దర్శకులు మాత్రం తాము డైరెక్ట్ చేసేటప్పుడు పెద్ద సినిమాలు.. నిర్మించేటప్పుడు చిన్న సినిమాలు చేస్తూ ట్రెంట్ సెట్ చేస్తున్నారు. చిన్న సినిమాలకు తమ బ్రాండ్ వ్యాల్యూ ఇస్తున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ వంగా, నాగ్ అశ్విన్ ఇలా అందరూ ఇదే దారిలో వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టీజర్ రాజమౌళి కంపౌండ్ నుంచి వచ్చింది. జక్కన్న సమర్పణలో ఆయన కుమారుడు కార్తికేయ నిర్మిస్తున్న సినిమా సినిమానే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. అల్లాద్దీన్ అద్భుతదీపం కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శశాంక్ యేలేటి. అలాగే మరో ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. డ్రాగన్ తీస్తూనే 418 అనే హారర్ సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌లోనే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ తెరకెక్కిస్తున్నారు నీల్. ఇదే బ్యానర్‌తో కలిసి 418 అనే సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. హార్రర్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని కీర్తన్ నాదగౌడ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా సైతం స్పిరిట్ లాంటి సెన్సేషనల్ సినిమా చేస్తూనే.. రోమాంచకం అనే చిన్న సినిమాను నిర్మిస్తున్నారు. సుమంత్ ప్రభాస్ ఇందులో హీరో. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న రోమాంచకం సినిమాను వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ కూడా కల్కి 2 చేస్తూనే.. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగ్ గీతం సినిమాను అన్నీ తానేయై ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సుకుమార్ చిన్న సినిమాలను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మొత్తానికి తమ బ్రాండ్‌ను చిన్న సినిమాల కోసం వాడేస్తున్నారు మన పెద్ద దర్శకులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

God Of War: డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’.. తారక్ కోసం గురూజీ మైథాలజీ మ్యాజిక్!

జెన్ జీకి హాలీవుడ్ ఫీవర్.. తెలుగు సినిమాలు ఎందుకు కనెక్ట్ కావడం లేదు?

మెగాఫోన్ పట్టిన మాస్ హీరోలు.. డైరెక్షన్‌లోనూ కమర్షియల్ ఫార్ములాపైనే నమ్మకం!

Published on: Jul 21, 2026 06:17 PM
Follow Us