AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: కండల వీరుడికి ఏమైంది..? సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూసి షాక్‌లో అభిమానులు!

Salman Khan: కండల వీరుడికి ఏమైంది..? సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూసి షాక్‌లో అభిమానులు!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 6:20 PM

Share

సల్మాన్ ఖాన్ అంటే కండలు తిరిగిన దేహం, ఫిట్ లుక్ ఇలా మైండ్‌లో ఓ రూపం వచ్చేస్తుంది. అలాంటి సల్మాన్‌కు ఇప్పుడేమైంది..? ఇలా అయిపోయారేంటి..? ఫిట్ బాడీతో కండల వీరుడిగా పేరు తెచ్చుకున్న సల్లూ భాయ్.. సడన్‌గా ఇలా మారిపోవడం వెనక రహస్యమేంటి..? ఎందుకింత నీరసంగా అయిపోయారు..? భాయిజాన్ హెల్త్ అంతా ఓకేనా..? చూస్తున్నారుగా.. సల్మాన్ లేటెస్ట్ లుక్ చూసాక ఇందాక మనం అడిగిన ప్రశ్నలన్నీ ఫ్యాన్స్ మదిలో మెదలాడుతూ ఉన్నాయి. అసలేమైంది మా హీరోకు అంటూ ఆరాలు తీస్తున్నారు వాళ్లు.

సల్మాన్ ఖాన్ అంటే కండలు తిరిగిన దేహం, ఫిట్ లుక్ ఇలా మైండ్‌లో ఓ రూపం వచ్చేస్తుంది. అలాంటి సల్మాన్‌కు ఇప్పుడేమైంది..? ఇలా అయిపోయారేంటి..? ఫిట్ బాడీతో కండల వీరుడిగా పేరు తెచ్చుకున్న సల్లూ భాయ్.. సడన్‌గా ఇలా మారిపోవడం వెనక రహస్యమేంటి..? ఎందుకింత నీరసంగా అయిపోయారు..? భాయిజాన్ హెల్త్ అంతా ఓకేనా..? చూస్తున్నారుగా.. సల్మాన్ లేటెస్ట్ లుక్ చూసాక ఇందాక మనం అడిగిన ప్రశ్నలన్నీ ఫ్యాన్స్ మదిలో మెదలాడుతూ ఉన్నాయి. అసలేమైంది మా హీరోకు అంటూ ఆరాలు తీస్తున్నారు వాళ్లు. ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ఆఫీస్‌కి వచ్చిన భాయీజాన్‌ను చూసి షాక్ అయ్యారంతా. అసలు గుర్తుపట్టలేనంత నీరసంగా మారిపోయారు కండల వీరుడు. 60 ఏళ్ల వయసులో కూడా మొన్నటి వరకు సూపర్ ఫిట్‌గా కనిపించిన సల్మాన్.. ఉన్నట్లుండి ఇలా అయిపోడానికి కారణమేంటి అంటూ షాక్‌లో ఉన్నారు ఫ్యాన్స్. ఇది కొత్త సినిమా కోసం చేసిన మేకోవరా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ లుక్‌పై సల్మాన్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. త్వరలోనే మాతృభూమితో రానున్నారు సల్మాన్. ఇప్పుడున్నంత నీరసంగా గతంలో ఎప్పుడూ కనబడలేదు సల్మాన్. తలపై క్యాప్‌తో, ముఖంలో గ్లో లేకుండా, ముడతలు పడ్డ శరీరంతో కనిపించారు భాయీజాన్. అసలీయన సల్మానేనా అని షాకవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి సినిమాతో బిజీగా ఉన్నారు సల్మాన్ ఖాన్. ఏదేమైనా కండలవీరుడి కొత్త లుక్ మాత్రం సస్పెన్స్‌గా మారిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీ సినిమాల దర్శకుల కొత్త మిషన్.. చిన్న సినిమాలకు పాన్ వరల్డ్ సపోర్ట్!

God Of War: డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’.. తారక్ కోసం గురూజీ మైథాలజీ మ్యాజిక్!

జెన్ జీకి హాలీవుడ్ ఫీవర్.. తెలుగు సినిమాలు ఎందుకు కనెక్ట్ కావడం లేదు?

మెగాఫోన్ పట్టిన మాస్ హీరోలు.. డైరెక్షన్‌లోనూ కమర్షియల్ ఫార్ములాపైనే నమ్మకం!

Follow Us