AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Varma: నువ్వూ, నీ జిడ్డు ఆటంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!

Tilak Varma Breaks Silence on Slow Strike Rate Criticism: వ్యక్తిగత రికార్డుల కంటే దేశం కోసం, జట్టు గెలుపు కోసం ఆడటమే తన ప్రాధాన్యతని తిలక్ వర్మ నిరూపించాడు. విమర్శకులకు బ్యాట్‌తోనే జవాబు చెప్తూ, రాబోయే జింబాబ్వే సిరీస్‌లో భారత్‌కు తొలి విజయాన్ని అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Tilak Varma: నువ్వూ, నీ జిడ్డు ఆటంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
Tilak Varma
Venkata Chari
|

Updated on: Jul 22, 2026 | 8:20 AM

Share

Tilak Varma Breaks Silence on Slow Strike Rate Criticism: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఎదురైన చేదు పరాజయాల తర్వాత, భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తనస్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు. జులై 23 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు విలేకరులతో మాట్లాడిన ఆయన, తాను స్వార్థంతో కాకుండా జట్టు పరిస్థితికి తగ్గట్టుగానే బ్యాటింగ్ చేస్తానని స్పష్టం చేశాడు.

జట్టు బాధ్యత నాదే.. పరిస్థితులకు తగ్గట్లే నా బ్యాటింగ్..!

విదేశీ గడ్డపై వరుస సిరీస్ ఓటముల తర్వాత భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మైదానంలో నెమ్మదిగా పరుగులు రాబడుతున్నారన్న ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు.

ఇదికూడా చదవండి: ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల

ఇవి కూడా చదవండి

“మైదానంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విదేశీ మైదానాల్లో వికెట్లు పడుతున్నప్పుడు జట్టును నిలబెట్టడం నా బాధ్యత. మొదటి బంతి నుంచే విరుచుకుపడే సత్తా నాకుంది. కానీ, ఆరంభంలోనే నాలుగైదు వికెట్లు కోల్పోయినప్పుడు బాధ్యతారాహిత్యంగా భారీ షాట్లకు వెళ్లి వికెట్ పారేసుకోవడం సరికాదు. జట్టు మేనేజ్‌మెంట్ నాకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చే క్రమంలోనే పరిస్థితిని బట్టి ఆడుతున్నాను” అని తిలక్ వర్మ స్పష్టం చేశారు.

ఘనమైన రికార్డులు ఉన్నా అనవసర విమర్శలా..?

ఐర్లాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో జట్టు 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు, తిలక్ వర్మ 46 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అలాగే ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు బాది తనలోని విధ్వంసకర రూపాన్ని చూపించాడు.

ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!

అంతేకాకుండా, ఈ ఏడాది స్వదేశంలో ముగిసిన ప్రపంచకప్ పోరులో 154.47 స్ట్రైక్ రేట్‌తో 207 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గణాంకాలను పరిశీలిస్తే, ఆయన వేగంపై వస్తున్న విమర్శల్లో నిజం లేదని, పరిస్థితులకు అనుగుణంగానే ఆయన తన శైలిని మార్చుకుంటున్నారని స్పష్టమవుతోంది.

జింబాబ్వే పర్యటనలో విజయమే లక్ష్యం..!

కొత్త సారథి శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ నేతృత్వంలోని యువ భారత జట్టు, జింబాబ్వే పర్యటన ద్వారా మళ్లీ విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉంది. జూలై 23 నుంచి జూలై 26 వరకు హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. గతంలో ఎదురైన పరాజయాలను మరిచిపోయి, ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని శ్రేయస్ సేన తీవ్రంగా శ్రమిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?