భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మద్యం మత్తులో సోలం నాగేశ్వరరావు అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన అతను పోలీసులతో వాగ్వాదానికి దిగి, ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చాడు. నడిరోడ్డుపై పోలీసులపై దాడికి యత్నించగా, పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.