AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 47 ఏళ్ల వయసులో తగ్గని అందం.. వర్కవుట్ వీడియో షేర్ చేసిన టాప్ హీరోయిన్..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీనియర్ హీరోయిన్స్ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. కుర్ర భామలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు... నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిల్లా ఫిట్నెస్ విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ 47 ఏళ్ల వయసులోనూ కఠినమైన జిమ్ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది.

Tollywood : 47 ఏళ్ల వయసులో తగ్గని అందం.. వర్కవుట్ వీడియో షేర్ చేసిన టాప్ హీరోయిన్..
Jyotika
Rajitha Chanti
|

Updated on: May 11, 2026 | 10:58 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె వయసు 47 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన జ్యోతిక. కోలీవుడ్ హీరో సూర్య సతీమణి. జ్యోతిక అంటే కేవలం అభినయానికే కాకుండా, క్రమశిక్షణకు కూడా మారుపేరు. 47 ఏళ్ల వయసులో కూడా ఆమె ప్రదర్శిస్తున్న ఫిట్‌నెస్ చూసి సినీ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. మదర్స్ డే సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వర్కవుట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తన ఆరోగ్యం కోసం జ్యోతిక కేటాయిస్తున్న సమయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. “ఈ మదర్స్ డే నాడు మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోండి.. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఆరోగ్యంగా ఉండటమే..” అంటూ ఆమె ఇచ్చిన సందేశం మహిళలను బాగా ఆకట్టుకుంది. వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని, సరైన పద్ధతులు పాటిస్తే ఎవరైనా దృఢంగా ఉండవచ్చని ఆమె నిరూపిస్తున్నారు. సాధారణంగా మహిళలకు అప్పర్ బాడీ స్ట్రెంత్ సాధించడం కష్టతరమైన పని. కానీ జ్యోతిక పుల్-అప్స్, చిన్-అప్స్ వంటి కఠినమైన వ్యాయామాలను అత్యంత సునాయాసంగా చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. కేవలం వీటితోనే కాకుండా, ట్రైసెప్ డిప్స్, బెంచ్ హాప్స్, కోర్ వర్కవుట్లు చేస్తూ తన ఫిట్‌నెస్ స్థాయిని చాటి చెప్పారు. ఆమె చేస్తున్న ఈ కసరత్తులు ఆమె పట్టుదలకు నిదర్శనం.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

జ్యోతిక పోస్ట్..

View this post on Instagram

A post shared by Jyotika (@jyotika)

జ్యోతిక ఫిట్‌నెస్‌ను చూసి బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, సోహా అలీ ఖాన్ వంటి ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు. నెటిజన్లు కూడా “మీరు మాకు పెద్ద ఇన్‌స్పిరేషన్” అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను నింపుతున్నారు. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి జ్యోతిక అనుసరిస్తున్న ఈ లైఫ్‌స్టైల్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా, శారీరక, మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ వ్యాయామానికి సమయం కేటాయించాలని ఆమె పరోక్షంగా సందేశమిచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

జ్యోతిక పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us