AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నెలకు లక్షల్లో జీతం.. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఒక్కో మూవీతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కుర్రాడు..

అతడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. నెలకు లక్షల్లో జీతం. అయినా.. నటనపై ఆసక్తి. దీంతో సినీరంగంలోకి వచ్చేందుకు మంచి ఉద్యోగాన్ని వదిలేశాడు. తన ప్రతిభతో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు సినీరంగంలో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేశాడు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు.

Tollywood: నెలకు లక్షల్లో జీతం.. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఒక్కో మూవీతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కుర్రాడు..
Basil Joseph
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2026 | 12:52 PM

Share

మలయాళీ చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బాసిల్ జోసెఫ్. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న క్రియేటివ్ దర్శకులలో ఒకరు. ఇప్పటివరకు బాసిల్ జోసెఫ్ నటించి.. తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనూ తన నెక్ట్స్ సినిమా రూపొందించనున్నట్లు ప్రచారం నడుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ డైరెక్టర్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. అతడి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ట్రై చేస్తున్నారు. కానీ మీకు తెలుసా.. బాసిల్ జోసెఫ్ సినిమాపై ఆసక్తితో నెలకు లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని వదిలేశాడు. అవును. అతడు ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కేరళకు చెందిన బాసిల్ జోసెఫ్.. చిన్నప్పటి నుంచే ఎంతో ప్రతిభావంతుడు. బాల్యం నుంచే నటనపై ఆసక్తి ఉండేది. సినిమాలంటే ఇష్టం.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రముఖ ఐటీ సంస్థ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగంలో చేరారు. మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పటికీ నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. దీంతో అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. 2015లో కుంజిరామాయణం సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన బాసిల్.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో అతడి సినిమాలకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. గోదా, మిన్నల్ మురళి, జయ జయ జయహే, ఫాలిమి, ప్రవింకూడు షప్పు, పోన్ మాన్, సూక్ష్మ దర్శిని వంటి చిత్రాలతో అటు నటుడిగా, ఇటు దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. అతడి సినిమాలు ప్రేక్షకులలో ప్రత్యేకమైన ముద్ర వేశాయి.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా సక్సెస్ అయిన బాసిల్ జోసెఫ్.. 2017లో తన స్నేహితురాలు ఎలిజబెత్ శ్యామూల్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే. ప్రస్తుతం బాసిల్ జోసెఫ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ తో అతడు తెరకెక్కించబోయే సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

బాసిల్ జోసెఫ్..

View this post on Instagram

A post shared by Rohith K Suresh (@rohith_ks)

ఎక్కువ మంది చదివినవి : Cinema : 6 కోట్లతో తీస్తే రూ.16 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..

Follow Us