Varanasi: సర్ ప్రైజ్ ఇచ్చిన వారణాసి మేకర్స్.. అదిరిపోయిన ప్రియాంక లుక్స్ రిలీజ్.. ఫోటోస్ చూశారా.. ?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వారణాసి. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మహేష్ బాబు ప్రీ లుక్స్, గ్లింప్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా సూపర్ స్టార్ అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేష్ బాబు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. అలాగే మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదివరకు విడుదలైన మహేష్ ప్రీ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇందులో ప్రియాంక మందాకిని పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు (జూలై 18న ) ఆమె పుట్టినరోజు కావడంతో సెట్ లోని ఫోటోలను విడుదల చేస్తూ రాజమౌళి పోస్ట్ చేశారు. “ఆమె నవ్నితే అందం.. నవ్వకపోతే నిప్పు కణిక..” అనే క్యాప్షన్ ఇస్తూ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు వైరలవుతున్నాయి. అటు మహేష్ సైతం ప్రియాంకకు విషెస్ చెప్పారు. “మా ఒకే ఒక్క మందాకినికి హ్యాపీ బర్త్ డే ” అంటూ రాసుకొచ్చారు.
మహేష్ బాబు సరసన ప్రియాంక మొదటిసారి నటిస్తున్నారు. ఈ మూవీ కోసం ఆమె దాదాపు 14 నెలల నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇందులో అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చేసినట్లు ఆమె చెప్పారు. అలాగే ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రపంచంతోపాటు కాలాల్ని చుట్టేసే సాహిసికుడి కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు జక్కన్న. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సరికొత్త సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యారు రాజమౌళి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ షూరు చేయనున్నారు.
ప్రియాంక విషయానికి వస్తే..
ప్రియాంక చోప్రా.. ఇప్పుడు గ్లోబల్ స్టార్. హిందీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. 2000లో ప్రపంచసుందరిగా కిరీటాన్ని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 2018 డిసెంబర్ లో అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్నారు ప్రియాంక. వీరికి సరోగసి ద్వారా మాల్తీ మేరీ చోప్రా అనే అమ్మాయి జన్మించింది.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఎన్టీఆర్ పోస్ట్..
Grace when she smiles.Fire when she doesn’t.
Mandakini… @PriyankaChopra in #Varanasi pic.twitter.com/4lYerYbm4Q
— rajamouli ss (@ssrajamouli) July 18, 2026
