గుడ్ న్యూస్.. JEE అడ్వాన్స్‌డ్ 2027లో కొత్త సౌకర్యం! ఇక ఆన్‌స్క్రీన్ కాలిక్యులేటర్ షురూ
JEE Advanced 2027 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. ఈసారి పరీక్షలో తొలిసారిగా ఆన్‌స్క్రీన్ కాలిక్యులేటర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐఐటీ ఢిల్లీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు కంప్యూటర్ స్క్రీన్‌పైనే 10 నుంచి 12 అంకెల డిస్‌ప్లే కలిగిన బేసిక్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకోవచ్చు. JEE Advanced 2027 పరీక్షను మే 23న నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి..

హైదరాబాద్, నవంబర్ 19: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. 2027 పరీక్షలో తొలిసారిగా ఆన్‌స్క్రీన్ కాలిక్యులేటర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ ఢిల్లీ అధికారికంగా ప్రకటించింది. దీంతో కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసే అభ్యర్థులకు కొంత వెసులుబాటు కలగనుంది. JEE Advanced 2027లో అభ్యర్థులు 10 నుంచి 12 అంకెల డిస్‌ప్లే కలిగిన బేసిక్ ఆన్‌స్క్రీన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది సైంటిఫిక్ కాలిక్యులేటర్ కాదు. కేవలం ప్రాథమిక గణిత లెక్కలు చేసుకునేందుకు వీలుగా నాన్-సైంటిఫిక్ కాలిక్యులేటర్‌ను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష సమయంలో అభ్యర్థులు తమ కంప్యూటర్ స్క్రీన్‌పైనే ఈ కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాలిక్యులేటర్ వినియోగానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను అధికారిక పరీక్షా సమాచార పుస్తకంలో వెల్లడించనున్నారు.
మే 23న JEE Advanced 2027 పరీక్ష
JEE Advanced 2027 పరీక్షను 2027 మే 23న (ఆదివారం) నిర్వహించనున్నట్లు ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ ఢిల్లీ చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారిక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. JEE Advanced 2027కు సంబంధించిన అర్హత ప్రమాణాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు అర్హత నిబంధనలను పరిశీలించాలని ఐఐటీ ఢిల్లీ సూచించింది. మరిన్ని వివరాలు, పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
ఆన్‌స్క్రీన్ కాలిక్యులేటర్ సదుపాయం అందుబాటులోకి రావడం JEE Advanced అభ్యర్థులకు ముఖ్యమైన మార్పుగా చెప్పవచ్చు. అయితే కాలిక్యులేటర్‌పై మాత్రమే ఆధారపడకుండా, ప్రాథమిక గణిత పరిజ్ఞానం, వేగం, కచ్చితత్వం పెంచుకునేలా విద్యార్థులు తమ ప్రిపరేషన్ కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2027 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




