AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2026: 6 ఓవర్లలో 9 వికెట్లు.. కమ్‌బ్యాక్‌తో ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్..!

Syed Mushtaq Ali Trophy 2026: భారత క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న మయాంక్ యాదవ్ మరోసారి తన సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరపున వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. గాయాల తర్వాత అతడి ఈ పునరాగమనం క్రికెట్ అభిమానుల్లో కొత్త ఆశలు నింపింది.

Year Ender 2026: 6 ఓవర్లలో 9 వికెట్లు.. కమ్‌బ్యాక్‌తో ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్..!
Mayank Yadav 9 Wickets
Venkata Chari
|

Updated on: Nov 19, 2026 | 9:00 AM

Share

Mayank Yadav 9 Wickets: భారత క్రికెట్‌లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగల బౌలర్లలో మయాంక్ యాదవ్ (Mayank Yadav) ఒకడు. గాయాల కారణంగా కెరీర్‌లో ఎదురైన ఆటంకాల తర్వాత మళ్లీ తన వేగంతో బ్యాటర్లను వణికిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన అతడు తొలి రెండు మ్యాచ్‌ల్లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులు మాత్రమే ఇచ్చి 9 వికెట్లు పడగొట్టడం అతడి సత్తాకు నిదర్శనం.

తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనత..

నవంబర్ 14న జమ్మూ కశ్మీర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మయాంక్ బంతితో నిప్పులు చెరిగాడు. ఢిల్లీ 243/6 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో జమ్మూ కశ్మీర్ 140 పరుగులకే ఆలౌటైంది. మయాంక్ కేవలం 3 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్‌లో అతడికి ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. ప్రత్యర్థి బ్యాటర్ల స్టంప్స్ ఎగిరిపోయేలా బౌలింగ్ చేయడంతో ఈ మ్యాచ్ వీడియోలు క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఎక్కువమంది చదివినది: Video: 13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం.. 281 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ దోస్త్ రికార్డుల మోత..!

ఇవి కూడా చదవండి

రెండో మ్యాచ్‌లోనూ అదే వేగం..

పంజాబ్‌తో నవంబర్ 16న జరిగిన మ్యాచ్‌లోనూ మయాంక్ తన జోరు కొనసాగించాడు. ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసి 240/5 భారీ స్కోరు సాధించింది. యశ్ ధుల్ 40 బంతుల్లో అజేయంగా 78 పరుగులు, ప్రియాంశ్ ఆర్య 55 పరుగులతో రాణించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ 131 పరుగులకే ఆలౌటైంది.

మయాంక్ కేవలం 3 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడి ఒక ఓవర్లో మూడు వికెట్లు పడటంతో పాటు మెయిడిన్‌గా ముగియడం మ్యాచ్‌లో కీలక మలుపు. ఢిల్లీ 109 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

ఎక్కువమంది చదివినది: IPL 2027 Retention: రిటెన్షన్ తర్వాత మారిన లెక్కలు.. పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?

టీమిండియాకు బలమైన ఫాస్ట్ బౌలింగ్ ఎంపిక?

రెండు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు.. ఎకానమీ కూడా ఆకట్టుకునే స్థాయిలో ఉండటంతో మయాంక్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. వేగం, బౌన్స్, వికెట్లు తీసే సామర్థ్యం అతడి ప్రధాన బలాలు. భారత జట్టు భవిష్యత్ ఫాస్ట్ బౌలింగ్ ప్రణాళికల్లో మయాంక్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే గాయాల సమస్య లేకుండా నిలకడగా ఆడటం అతడికి అత్యంత ముఖ్యం. ఈ దేశవాళీ టోర్నీలో అతడి ప్రదర్శనపై ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us